News March 26, 2024
యాక్షన్ షూట్‌లో ‘మిస్టర్ బచ్చన్’

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా యాక్షన్ సీన్స్ చిత్రీకరణ జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తూ హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు. ‘యాక్షన్ టైమ్ ఫర్ మిస్టర్ బచ్చన్’ అని పేర్కొన్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Similar News
News March 28, 2026
‘అమరావతి’పై నేడు ప్రత్యేకంగా అసెంబ్లీ.. వైసీపీ హాజరుపై సందిగ్ధత

AP: రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై అసెంబ్లీ ఇవాళ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. ఈ మేరకు విభజన చట్టంలో సవరణ చేయాలని కోరుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది. CM చంద్రబాబు, Dy.CM పవన్‌తోపాటు దాదాపు 20 మంది MLAలు ప్రసంగించనున్నారు. ఈ సమావేశానికి వైసీపీ MLAల హాజరుపై ఇప్పటికీ స్పష్టత లేదు. చట్టబద్ధతపై మండలిలోనూ చర్చించాలని ఆ పార్టీ నేత సజ్జల ఇటీవల డిమాండ్ చేశారు.
News March 28, 2026
నేటి నుంచే IPL సమరం

వేసవిలో వినోదాన్ని పంచేందుకు IPL సిద్ధమైంది. నేటి నుంచి రెండు నెలల పాటు అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వనుంది. మొత్తం 10 జట్లు 74 మ్యాచులు ఆడనున్నాయి. నేడు జరిగే తొలిపోరులో SRH, RCB తలపడనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య 26 మ్యాచులు జరగ్గా SRH 14, RCB 11 గెలిచాయి. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. భారీ హిట్టర్లతో కూడిన ఆరెంజ్ ఆర్మీ ఇవాళ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
News March 28, 2026
కోచింగ్ సెంటర్లకు కొత్త రూల్స్.. రోజుకు 5 గంటలే

AP: కోచింగ్ సెంటర్ల నిర్వహణకు ఉన్నత విద్యాశాఖ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ప్రతి సంస్థ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆదివారం సెలవు ఇవ్వాలి. రోజుకు 5 గంటలే నడపాలి. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇంటర్నల్‌గా ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలి. ఫీజుల కోసం వేధించొద్దు. భవనం రూల్స్‌కు అనుగుణంగా ఉండాలి. వీటిని ఉల్లంఘిస్తే ₹లక్ష వరకు ఫైన్ ఉంటుంది. అయినా రిపీట్ అయితే రిజిస్ట్రేషన్ రద్దవుతుంది.


