News July 5, 2024
‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్ డేట్ ఫిక్స్?
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ఆగస్టు 15న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 14న ప్రీమియర్స్ వేయనున్నట్లు సమాచారం. దీనిపై మూవీ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వాల్సి ఉంది. హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
Similar News
News January 17, 2025
ఇది మా కుటుంబానికి కఠినమైన రోజు: కరీనా
సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన దాడి ఘటనపై సతీమణి, హీరోయిన్ కరీనా కపూర్ స్పందించారు. ఇది తమ కుటుంబానికి చాలా కఠినమైన రోజు అని ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్టు చేశారు. ‘అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కష్ట సమయంలో అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు. మీడియా ప్రతినిధులు ఊహాజనిత కథనాలకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ ఘటన నుంచి తేరుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నా’ అని రాసుకొచ్చారు.
News January 17, 2025
ట్రూత్ ఈజ్ ది ఓన్లీ ఫార్ములా: KTR
TG: ఈడీ విచారణ అనంతరం ఇంటికి చేరుకున్న మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈడీ ఆఫీస్ ముందు మీడియాతో మాట్లాడిన ఫొటోలను షేర్ చేసిన ఆయన ‘ట్రూత్ ఈజ్ ది ఓన్లీ ఫార్ములా’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఫార్ములా-ఈ కారు రేస్ వ్యవహారంలోనే కేటీఆర్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే.
News January 16, 2025
Q3లో రిలయన్స్, జియో ఆదాయాలు ఇలా..
2024-25 Q3లో 7 శాతం వృద్ధితో రూ.18,540 కోట్ల నికర ఆదాయం వచ్చినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ.2.43 లక్షల కోట్లకు చేరినట్లు తెలిపింది. ఇక డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి జియో ఆదాయం రూ.6,681 కోట్లుగా నమోదైనట్లు పేర్కొంది. 2023 డిసెంబర్ నాటికి రూ.5,447 కోట్లు ఉండగా ఈసారి 26 శాతం పెరిగినట్లు వెల్లడించింది.