News September 7, 2024

SEP 12న నెట్‌ఫ్లిక్స్‌లోకి ‘మిస్టర్ బచ్చన్’

image

రవితేజ హీరోగా డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ మూవీ ఈనెల 12న ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలో ఇది రిలీజ్ అవుతుంది. ఆగస్టు15న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇందులో రవితేజకు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించారు.

Similar News

News December 3, 2025

జగిత్యాల: ‘ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు’

image

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై బుధవారం ఆమె కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జగిత్యాల కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, ఎన్నికల పరిశీలకులు రమేష్, అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

News December 3, 2025

T20 వరల్డ్ కప్‌కి టీమ్ ఇండియా జెర్సీ రిలీజ్

image

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026కు సంబంధించిన టీమ్ ఇండియా జెర్సీని బీసీసీఐ రిలీజ్ చేసింది. రాయ్‌పూర్‌లో SAతో జరుగుతున్న రెండో వన్డే ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో రోహిత్ శర్మ, తిలక్ వర్మ ఈ జెర్సీలను అన్‌వెయిల్ చేశారు. ‘టీమ్‌కు ఎప్పుడూ నా బెస్ట్ విషెస్ ఉంటాయి’ అని రోహిత్ శర్మ పేర్కొన్నారు. 2026 ఫిబ్రవరి 7నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది.

News December 3, 2025

టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. గిల్ రీఎంట్రీ

image

సౌతాఫ్రికాతో ఈ నెల 9 నుంచి జరగనున్న 5 మ్యాచుల టీ20 సిరీస్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. గాయం నుంచి కోలుకున్న గిల్ తిరిగి జట్టులో చోటు సంపాదించారు. ఫిట్‌నెట్‌ను బట్టి ఆయన ఆడే అవకాశాలుంటాయని బోర్డు తెలిపింది.

టీమ్: సూర్య కుమార్(కెప్టెన్), గిల్, అభిషేక్, తిలక్, హార్దిక్ పాండ్య, దూబే, అక్షర్, జితేశ్ శర్మ, శాంసన్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, అర్ష్‌దీప్