News June 2, 2024
YouTubeలో మిస్టర్ బీస్ట్ రికార్డ్

అమెరికన్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ (జిమ్మీ డొనాల్డ్‌సన్) అరుదైన ఘనత సాధించారు. 267M సబ్‌స్క్రైబర్‌లతో ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లున్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు. T-సిరీస్ 266M సబ్‌స్క్రైబర్‌లతో 2వ స్థానంలో ఉంది. 2012లో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన మిస్టర్ బీస్ట్ వినూత్న వీడియోలు చేస్తూ ఆదరణ పొందారు. అతడి వీడియోలను కోట్లాది మంది వీక్షిస్తుండటంతో యూట్యూబ్ ద్వారా రూ.వేల కోట్లు సంపాదిస్తున్నారు.
Similar News
News September 18, 2025
మోదీకి విషెస్ జెన్యూన్ కాదన్న యూట్యూబర్‌పై విమర్శలు

ప్రధాని మోదీకి బర్త్ డే విషెస్ చెబుతూ ప్రముఖులు చేసిన ట్వీట్లు జెన్యూన్ కాదని యూట్యూబర్ ధ్రువ్ రాథీ ఆరోపించారు. ప్రముఖులు విష్ చేసేలా ఆయన టీమ్ ముందే వారికి ‘టూల్ కిట్’ ఇచ్చిందన్నారు. దీంతో ధ్రువ్ రాథీపై మోదీ అభిమానులు ఫైరవుతున్నారు. ట్రంప్, మెలోనీ, పుతిన్ వంటి నేతలను కూడా ఆయన టీమ్ మ్యానేజ్ చేసిందా అని ప్రశ్నిస్తున్నారు. రాహుల్, కేజ్రీవాల్‌కు కూడా ‘టూల్ కిట్’ ఇచ్చారా అని కౌంటర్ ఇస్తున్నారు.
News September 18, 2025
అక్టోబర్ 18న పీఎం కిసాన్ నిధులు విడుదల?

పీఎం కిసాన్ 21వ విడత డబ్బులను కేంద్రం అక్టోబర్ 18న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 20న దీపావళి నేపథ్యంలో అంతకుముందే నిధులను జమ చేయాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్లు జాతీయా మీడియా పేర్కొంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ స్కీమ్ కింద ఏడాదికి 3 విడతల్లో రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.
News September 18, 2025
రాష్ట్రంలో 21 పోస్టులు

<