News September 1, 2025
మిస్టర్ గాంధీ.. మీ CM ఏం చేస్తున్నారో మీకైనా తెలుసా: KTR

TG: కాంగ్రెస్ ప్రభుత్వం తమపై ఎన్ని కుట్రలు చేసినా చట్టపరంగా పోరాడతామని KTR అన్నారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని ట్వీట్ చేశారు. ‘తెలంగాణలో రాహుల్ గాంధీ కరెన్సీ మేనేజర్ (CM) కాళేశ్వరం కేసును CBIకి అప్పగించాలని నిర్ణయించారు. రాహుల్ గాంధేమో బీజేపీకి CBI “ప్రతిపక్ష ఎలిమినేషన్ సెల్”లా పనిచేస్తోందని గతంలో ఆరోపించారు. మిస్టర్ గాంధీ.. మీ CM ఏం చేస్తున్నారో మీకైనా తెలుసా’ అని KTR ప్రశ్నించారు.
Similar News
News September 4, 2025
GST తగ్గింపుతో ఏమవుతుందో తెలుసా?

GST శ్లాబుల కోతతో ప్రభుత్వానికి రూ.93వేల కోట్ల ఆదాయం తగ్గనుంది. అదే సమయంలో లగ్జరీ వస్తువులను 40% జీఎస్టీ శ్లాబులోకి తీసుకురావడం వల్ల రూ.45వేల కోట్ల ఆదాయం రానుంది. ఫలితంగా రూ.48వేల కోట్ల లోటు ఏర్పడనుంది. అయితే పన్ను తగ్గింపుతో ప్రజల వద్ద డబ్బు మిగులుతుంది. దాన్ని ఖర్చు చేసేందుకు ఇష్టపడతారు. దీంతో ఆ డబ్బు తిరిగి ఎకానమీలోకి వస్తుంది. పన్ను తగ్గించినా ప్రభుత్వానికి పెద్దగా నష్టం ఉండదు.
News September 4, 2025
జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు!

APలో 3 నెలల ముందే స్థానిక ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పంచాయతీరాజ్, పురపాలక శాఖల కమిషనర్లకు లేఖలు రాశారు. ‘OCT 15లోగా వార్డుల విభజన పూర్తి చేయాలి. NOV 30లోగా పోలింగ్ కేంద్రాలు, DEC 15లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలి. 2026 JANలో ఎన్నికల నోటిఫికేషన్, ఫలితాలు ప్రకటించాలి’ అని ప్రీ ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించారు. కాగా 2026 APRలో సర్పంచుల పదవీకాలం ముగియనుంది.
News September 4, 2025
ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు

AP: వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వైపు కదిలేందుకు అవకాశముందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కృష్ణా, గోదావరి నదుల ప్రవాహం పూర్తి స్థాయిలో తగ్గే వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.