News August 27, 2024
దేవర నుంచి Mr.ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్

కొరటాల శివ డైరెక్షన్లో Mr.ఎన్టీఆర్, జాన్వీ జంటగా నటించిన దేవర మూవీ సరిగ్గా నెల రోజుల్లో(సెప్టెంబర్ 27) రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ఇవాళ ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘ది ఫేసెస్ ఆఫ్ ఫియర్’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇందులో యంగ్ టైగర్ రెండు రకాల లుక్‌తో కనిపించారు. దీంతో ఆయన సినిమాలో డబుల్ యాక్షన్ చేస్తున్నారా? అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News November 23, 2025
పర్సనల్ లైఫ్ తప్ప పైరసీపై నోరుమెదపని iBOMMA రవి?

iBOMMA నిర్వాహకుడు రవి నాలుగో రోజు విచారణలో తన లైఫ్‌స్టైల్ గురించి పలు విషయాలు వెల్లడించినట్లు సమాచారం. ‘పైరసీతో వచ్చిన డబ్బులను ఎప్పటికప్పుడు ఖర్చు చేశా. 15-20 రోజులకొకసారి విదేశాలకు వెళ్లాను. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, US, ఫ్రాన్స్, థాయ్‌లాండ్, దుబాయ్ తదితర దేశాలు తిరిగాను’ అని చెప్పినట్లు తెలుస్తోంది. పర్సనల్ విషయాలు తప్ప పైరసీ నెట్వర్క్ గురించి నోరు తెరవలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.
News November 23, 2025
సర్పంచ్ ఎన్నికల ఖర్చు అంతే!

TG: సర్పంచ్ ఎన్నికల ఖర్చు విషయంలో ఎన్నికల సంఘం అధికారులు మరోసారి స్పష్టత ఇచ్చారు. 2011 సెన్సెస్ ఆధారంగా ఖర్చు ఉంటుందని వెల్లడించారు. 5వేల ఓటర్లకు పైగా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.2.50 లక్షలు, 5 వేల లోపు పంచాయతీల్లో రూ.1.50 లక్షలు, 5 వేలకు పైగా జనాభా ఉన్న గ్రామాల్లో వార్డు సభ్యులకు రూ.50 వేలు, 5 వేలకు తక్కువగా ఉన్న గ్రామాల్లో రూ.30 వేల చొప్పున ఖర్చు పెట్టాల్సి ఉంటుందని వివరించారు.
News November 23, 2025
వాన్ Vs వసీం.. ఈసారి షారుఖ్ మూవీ పోస్టర్‌తో!

యాషెస్ తొలి టెస్టులో ENG ఓటమితో ఆ జట్టు మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్‌ను భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ట్రోల్ చేశారు. మ్యాచ్ 2వ రోజు ENG ఆధిపత్యం చెలాయిస్తుందని వాన్ చెప్పారు. కానీ హెడ్ చెలరేగడంతో AUS గెలిచింది. దీంతో వసీం ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ ఫొటో పోస్ట్ చేసి ‘Hope you’re okay @michaelvaughan’ అని పేర్కొన్నారు. గతంలోనూ IND, ENG మ్యాచుల సందర్భంలో పుష్ప, జవాన్ మీమ్స్‌తో వసీం ట్రోల్ చేశారు.


