News February 19, 2025

‘మిస్టర్ యోగి.. ఆ నీటిని తాగి చూపించు’.. ప్రశాంత్ భూషణ్ సవాల్

image

ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా నీటిలో ఫేకల్ బ్యాక్టీరియా ఉందన్న CPCB రిపోర్ట్ సంచలనంగా మారింది. ఈ నివేదికను యూపీ సీఎం యోగి <<15514963>>ఖండించారు.<<>> ఆ నీరు తాగొచ్చని కూడా ప్రకటించారు. దీనిపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సీఎంకు సవాల్ విసిరారు. ‘యోగి, ఆయన మంత్రివర్గానికి ఛాలెంజ్ చేస్తున్నా. మీరు మహా కుంభమేళాలో ఓ గ్లాస్ నీటిని తాగి చూపించండి’ అని ఛాలెంజ్ చేశారు.

Similar News

News November 25, 2025

డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు

image

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేశారు. మూడు దశల్లో (డిసెంబర్ 11, 14, 17) పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఉ.7 నుంచి మ.1 వరకు పోలింగ్ ఉంటుందని, అదే రోజు 2PM నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తామన్నారు. ఈ నెల 27 నుంచి తొలి విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని చెప్పారు.

News November 25, 2025

స్మృతి మంధానను లవర్ పలాశ్ మోసం చేశాడా?

image

క్రికెటర్ స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ <<18374733>>వివాహం<<>> ఆగిపోయిన విషయం తెలిసిందే. ఆమె తండ్రికి గుండెపోటు రావడంతో వివాహాన్ని ఆపేసినట్లు ప్రకటించారు. ఇప్పుడు మ్యారేజ్ క్యాన్సిలవ్వడానికి కారణం మరొకటుందని SMలో చర్చ జరుగుతోంది. పలాశ్ వేరే యువతితో చేసిన చాటింగ్ అంటూ కొన్ని స్క్రీన్ షాట్స్ వైరలవుతున్నాయి. అందుకే స్మృతి పెళ్లి రద్దు చేసుకున్నారని తెలుస్తోంది. ఈ స్క్రీన్ షాట్స్‌ను అఫీషియల్‌గా ధ్రువీకరించాల్సి ఉంది.

News November 25, 2025

ఇతిహాసాలు క్విజ్ – 77 సమాధానాలు

image

ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా ఇవ్వమని ఎందుకు అడిగాడు?
జవాబు: ఏకలవ్యుడు మొరుగుతున్న కుక్క నోటిని బాణాలతో కుట్టి, దాన్ని మొరగకుండా చేశాడు. ఈ విలువిద్యను చూసిన ద్రోణుడు అతనికి అస్త్రాలను దుర్వినియోగం చేస్తాడని, విచక్షణా రహితంగా వాడే అవకాశముందని విలువిద్యకు కీలకమైన బొటనవేలుని గురుదక్షిణగా అడిగాడు. అలాగే అర్జునుడికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>