News November 2, 2024
తన డీప్‌ఫేక్ ఫొటోపై స్పందించిన మృణాల్

సినీ ఇండస్ట్రీని డీప్‌ఫేక్ వెంటాడుతూనే ఉంది. తాజాగా నటి మృణాల్ ఠాకూర్‌తో దీపావళి టపాసులు కాల్చినట్లు ఓ వ్యక్తి ఫొటో ఎడిట్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇది వైరలవడంతో దీనిపై మృణాల్ స్పందించారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ‘మీరెందుకు ఇలా తప్పుగా ఫొటోలు ఎడిట్ చేస్తున్నారు? ఈ పని బాగుంది అనుకుంటున్నారా? అస్సలు బాలేదు’ అని కామెంట్ చేశారు. గతంలోనూ అసభ్యకర వీడియోకు రష్మికతో డీప్‌ఫేక్ చేశారు.
Similar News
News September 17, 2025
పలు శాఖల పనితీరుపై సీఎం ఆగ్రహం

AP: హోం, మున్సిపల్, రెవెన్యూ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ శాఖలపై ప్రజల్లో అసంతృప్తి ఉందని సర్వేలు తేల్చాయని కలెక్టర్ల సదస్సులో వెల్లడించారు. హోంశాఖ, మున్సిపల్ శాఖలు సరిగా పనిచేయడం లేదని తనకు ఫీడ్‌బ్యాక్ వచ్చిందన్నారు. అన్నిశాఖల మంత్రులు, అధికారులు ఫైళ్లను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
News September 17, 2025
అమరావతిలో క్వాంటం వ్యాలీ.. ఆకృతి ఇదే!

AP: అమరావతిలో క్వాంటం వ్యాలీ నిర్మాణానికి ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. నిన్న కలెక్టర్ల సదస్సులో ప్రదర్శించిన కట్టడాల ఆకృతినే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యాలీ కోసం 50ఎకరాలు కేటాయించగా, ప్రధాన భవనాన్ని అమరావతి ఆకృతి(A)లో నిర్మించనున్నట్లు సమాచారం. సాధారణంగానే పునాదులు నిర్మించి, మిగిలిన కట్టడాన్ని ప్రీ ఇంజినీరింగ్ సాంకేతికతతో వీలైనంత త్వరగా పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
News September 17, 2025
76వ వసంతంలోకి ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ నేడు 76వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఓ సాధారణ కుటుంబం నుంచి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశానికి ప్రధానిగా ఎదిగారు. గుజరాత్‌కు 13 ఏళ్లు సీఎంగా చేశారు. 11 ఏళ్లుగా ప్రధానిగా కొనసాగుతున్నారు. ఆయన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ప్రశంసలతో పాటు విమర్శలనూ ఎదుర్కొన్నారు. ప్రధానిగా ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. Happy Birthday PM Narendra Modi.