News March 4, 2025

MROలపై చర్యలు తీసుకుంటాం: జేసీ

image

అల్లూరి జిల్లాలో మ్యుటేషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలని జేసీ అభిషేక్ గౌడ ఆదేశించారు. రెవెన్యూ సదస్సులో స్వీరించిన ఫిర్యాదులు, భూ సమస్యల పరిష్కారం, రైతుల రిజిస్ట్రేషన్, భూ సర్వే, మ్యుటేషన్లపై కలెక్టరేట్‌లో మంగళవారం వీసీ నిర్వహించారు. భూముల సర్వేకు సహకరించని సర్వేయర్లపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్లకు సూచించారు. MROలు ఆఫీసులకు రావడంలేదనే ఫిర్యాదులు వస్తున్నాయని.. వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News July 6, 2025

పెద్దపల్లి: జిల్లా అధ్యక్షుడిగా ఏటూరి శ్రావణ్‌ కుమార్‌

image

తెలంగాణ ధూప దీప నైవేద్య అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఏటూరి శ్రావణ్‌ కుమార్‌ ఆచార్యులు నియామకం అయ్యారు. పెద్దపల్లిలోని హనుమాన్‌ దేవాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరంబుదూరు శ్రీకాంత్‌ ఆచార్యులు, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నిట్టూరి సతీష్‌ శర్మ, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాండూరి దామోదరచార్యులు ఆయనకు నియామకపు ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రావణ్‌ కుమార్‌ ఆచార్యులును పలువురు అభినందించారు.

News July 6, 2025

టెస్టు చరిత్రలో తొలిసారి

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓ టెస్టులో తొలిసారిగా 1000+ రన్స్ నమోదు చేసింది. తొలి ఇన్నింగ్సులో 587 చేసిన గిల్ సేన రెండో ఇన్నింగ్సులో 427 పరుగులు చేసింది. ఇప్పటివరకు 2004లో ఆస్ట్రేలియాపై చేసిన 916 పరుగులే భారత జట్టుకు అత్యధికం. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో గిల్ ద్విశతకం, శతకం బాదగా ఇతర ప్లేయర్లు ఒక్క సెంచరీ చేయకపోవడం గమనార్హం.

News July 6, 2025

కామారెడ్డి: పీర్లను సందర్శించిన షబ్బీర్ అలీ

image

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మొహరంలో భాగంగా శనివారం రాత్రి హైదరాబాద్ పాతబస్తీలో పీర్ల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వ సలహాదారు వెంట కాంగ్రెస్ నాయకులు, ముస్లిం మత పెద్దలు ఉన్నారు. ఆయన మాట్లాడుతూ.. మొహరం అన్ని వర్గాల వారు జరుపుకోవడం అభినందనీయమన్నారు.