News March 4, 2025
MROలపై చర్యలు తీసుకుంటాం: జేసీ

అల్లూరి జిల్లాలో మ్యుటేషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలని జేసీ అభిషేక్ గౌడ ఆదేశించారు. రెవెన్యూ సదస్సులో స్వీరించిన ఫిర్యాదులు, భూ సమస్యల పరిష్కారం, రైతుల రిజిస్ట్రేషన్, భూ సర్వే, మ్యుటేషన్లపై కలెక్టరేట్లో మంగళవారం వీసీ నిర్వహించారు. భూముల సర్వేకు సహకరించని సర్వేయర్లపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్లకు సూచించారు. MROలు ఆఫీసులకు రావడంలేదనే ఫిర్యాదులు వస్తున్నాయని.. వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News March 4, 2025
వెయిట్ లిఫ్టింగ్ పోటీల విజేతలకు అభినందనలు

అల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఏయూ తరఫున పాల్గొని 71 కిలోల విభాగంలో ఎస్.పల్లవికి గోల్డ్ మెడల్, 76 కిలోల విభాగంలో బి.జాన్సీ బ్రాంజ్ మెడల్ సాధించారు. అదేవిధంగా ఖేలో ఇండియా యూనివర్శిటి పోటీల్లో 71 కిలోల విభాగంలో ఎస్.పల్లవికి సిల్వర్ మెడల్, సీహెచ్ శ్రీలక్ష్మికి 87 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. వీరిని ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ అభినందించారు.
News March 4, 2025
చీపురుపల్లిలో యాక్సిడెంట్.. ఒకరి మృతి

చీపురుపల్లి మెయిన్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో గరివిడి మండలం రేగటికి చెందిన కుడుముల బంగారినాయుడు(32) మృతి చెందాడు. చీపురుపల్లి కనకమహాలక్ష్మి జాతరకు తన స్నేహితుడు శనపతి రాముతో కలిసి వచ్చాడు. జాతర నుంచి తిరగివెళ్తుండగా మెయిన్ రోడ్డులో బైక్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక కూర్చున్న బంగారినాయుడు రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
News March 4, 2025
బాపట్ల జిల్లాలో TODAY TOP HEADLINES

★చిన్నారిపై లైంగిక దాడి.. రంగంలోకి క్లూస్ టీం★ఆలపాటి ప్రస్థానం మొదలైంది ఇలా.!★ 2 సార్లు గెలిచి.. ఈసారి ఓడారు.!★అత్యంత పేదరిక జిల్లాల్లో బాపట్ల జిల్లాకు 4వ స్థానం★శరవేగంగా గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు.!★మాజీ MLA ఇంటి ముందు TDP శ్రేణుల సంబరాలు★ జగన్ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి: అనగాని★ కారంచేడులో రోడ్డు ప్రమాదం