News October 8, 2024
రేపు రాష్ట్రవ్యాప్త నిరసనకు MRPS పిలుపు

TG: రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ప్రభుత్వం వర్గీకరణ లేకుండానే 11వేల టీచర్ పోస్టుల భర్తీ చేస్తోందని ఆయన అన్నారు. దీన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రాల్లో అంబేడ్కర్ విగ్రహాల నుంచి కలెక్టరేట్ల వరకు ర్యాలీ నిర్వహించి ధర్నాలు చేపట్టాలని అన్నారు. కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు.
Similar News
News March 20, 2026
మార్చి 20: చరిత్రలో ఈ రోజు

1351: ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణం
1602: డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన
1980: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ జననం
1987: టాలీవుడ్ సింగర్ హరిచరణ్ జననం
2008: సినీ నటుడు శోభన్ బాబు మరణం(ఫొటోలో)
*అంతర్జాతీయ సంతోష దినం
News March 20, 2026
తండ్రి అయిన RCB కెప్టెన్

RCB కెప్టెన్ రజత్ పాటీదార్ తండ్రి అయ్యారు. ఆయన భార్య గుంజన్ పండంటి మగ బిడ్డకు నిన్న జన్మనిచ్చారు. దీంతో IPL ప్రారంభానికి వారం రోజుల ముందే వారి ఇంట్లో ఆనందం వెల్లివెరిసింది. మధ్యప్రదేశ్‌లోని ఇండర్‌కు చెందిన పాటీదార్ 2022లో గుంజన్‌ను వివాహమాడారు. మరోవైపు మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కూడా <<19424001>>ఉగాది రోజునే<<>> మరోసారి తండ్రయ్యారు. దినేశ్, పాటీదార్ ఒకేరోజు పుట్టడం(జూన్ 1) విశేషం.
News March 20, 2026
ఇరాన్‌తో యుద్ధం కోసం ₹18 లక్షల కోట్లు!

ఇరాన్‌తో యుద్ధం కొనసాగించేందుకు $200 బిలియన్లు(₹18 లక్షల కోట్లు) కావాలని US కాంగ్రెస్‌ను పెంటగాన్ కోరినట్లు తెలుస్తోంది. ఇది ఇరాన్ ఎకానమీ($356B)లో సగం కంటే ఎక్కువ కావడం గమనార్హం. యుద్ధం మొదలైన తొలి వారంలోనే US $11B పైగా ఖర్చు చేసింది. ‘$200B అంటే చిన్న మొత్తమే. US ఎకానమీని దెబ్బతీస్తున్న ఇజ్రాయెల్ PM నెతన్యాహుకు అమెరికన్లు థాంక్స్ చెప్పాలి’ అని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ ఎద్దేవా చేశారు.


