News December 15, 2024
ప్రభాస్ ‘స్పిరిట్’లో మృణాల్ ఠాకూర్?

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించబోయే ‘స్పిరిట్’ సినిమా గురించి రోజుకో వార్త పుట్టుకొస్తోంది. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్నట్లు, కీలక పాత్రల్లో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ కనిపించనున్నట్లు హిందీ వెబ్సైట్లు రాసుకొచ్చాయి. అయితే ఇందులో నిజం లేదని, ఈ ముగ్గురిలో ఎవరితోనూ చర్చలు కూడా జరగలేదని మూవీ టీమ్ స్పష్టతనిచ్చినట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి.
Similar News
News October 23, 2025
ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో 88 పోస్టులు

ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ 88 అప్రెంటిస్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, బీఈ, బీటెక్, డిప్లొమా, ఎంఎస్సీ, B.LSc అర్హతగల అభ్యర్థులు ఈ నెల 26వరకు అప్లై చేసుకోవచ్చు. ముందుగా NATS పోర్టల్లో ఎన్రోల్ చేసుకోవాలి. అనంతరం దరఖాస్తు ఫారం, డాక్యుమెంట్స్ పోస్ట్ చేయాలి. వెబ్సైట్: https://dtu.ac.in/
News October 23, 2025
సోదరులు.. ఈ బాధ్యతను మరవొద్దు!

‘భాయ్ దూజ్’ రోజున తమ సోదరి ఆహ్వానాన్ని గౌరవించి సోదరులు ఆమె ఇంటికి సంతోషంగా వెళ్లాలి. ఆమెకు ప్రీతిపాత్రమైన కానుకలు, వస్త్రాలు తీసుకెళ్లాలి. ఇది సోదరి పట్ల ప్రేమ, గౌరవాన్ని తెలియజేస్తుంది. సోదరి పెట్టే తిలకం, హారతిని భక్తితో స్వీకరించాలి. భోజనం చేసిన తర్వాత, ఆమె పాదాలకు నమస్కరించి, వారి దీర్ఘాయుష్షు కోసం ప్రార్థించాలి. ఎప్పుడూ వారికి తోడుగా ఉంటానని, కష్టాల్లో రక్షణగా నిలుస్తానని వాగ్దానం చేయాలి.
News October 23, 2025
అందరికీ ఆదర్శం ఈ కిసాన్ చాచీ

బిహార్లోని ముజఫర్పుర్ జిల్లా సరేయాకు చెందిన 73 ఏళ్ల రాజకుమారి దేవి ఉత్సాహంగా సైకిల్పై ప్రయాణిస్తూ కనిపిస్తారు. గత 20ఏళ్లుగా సైకిల్పై వెళ్లి సమీపగ్రామాల్లోని మహిళలకు ఆధునిక వ్యవసాయం, ఊరగాయలు పెట్టడం నేర్పిస్తున్నారామె. ఆమె సేవలకుగానూ 2007లో కిసాన్ శ్రీ, 2019లో పద్మశ్రీ అవార్డులు వరించాయి. తాము ఆర్థికంగా బలపడేందుకు సాయం చేస్తున్న రాజకుమారిని అక్కడివారు ముద్దుగా కిసాన్ చాచీ అని పిలుచుకుంటారు.