News December 23, 2024
MS ధోనీ క్రికెట్ ప్రస్థానానికి నేటితో 20 ఏళ్లు!

స్టైలిష్‌గా పొడవాటి జుట్టుతో MS ధోనీ 2004లో డిసెంబర్ 23న బంగ్లాదేశ్‌పై మ్యాచుతో అరంగేట్రం చేశారు. ఆ మ్యాచ్‌లో ‘0’కే రనౌట్ అయినా, ఆపై అంచెలంచెలుగా ఎదిగి IND మేటి కెప్టెన్లలో ఒకరిగా నిలిచారు. 2007 T20WC, 2011 వన్డే WC, 2013లో CT సాధించారు. అలాగే IPLలోనూ CSKకు 5 ట్రోఫీలు అందించారు. 2020, ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైనా IPL ఆడుతూ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు.
Similar News
News January 23, 2026
నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్‌లో ఉద్యోగాలు

<
News January 23, 2026
ఆర్థిక సంస్థల కేంద్రంగా అమరావతి: CBN

AP: వ్యవసాయంతో పాటు రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థలకూ అధిక రుణాలివ్వాలని CM CBN బ్యాంకర్ల సమావేశంలో సూచించారు. డిస్కంలు కూడా కౌంటర్ గ్యారంటీ ఇస్తున్నాయని చెప్పారు. ‘అమరావతిని ఆర్థిక సంస్థల కేంద్రంగా మారుస్తున్నాం. 15 బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఏర్పాటవుతున్నాయి. డ్వాక్రా సంఘాల ఖాతాలపై వేస్తున్న 15 రకాల ఛార్జీలను తగ్గించాలి. ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ను ప్రోత్సహించాలి’ అని పేర్కొన్నారు.
News January 23, 2026
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ 769.67 పాయింట్లు క్షీణించి 81,537.70 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 241.25 పాయింట్లు పడిపోయి 25,048.65కు దిగజారింది. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (Indigo), సిప్లా వంటి షేర్లు భారీగా నష్ట పోయాయి. డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, ONGC వంటివి కొంత మేర లాభాల్లో నిలిచాయి.


