News March 19, 2024
బాపట్ల TDP MP అభ్యర్థిగా ఎంఎస్ రాజు
AP: బాపట్ల టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు పేరును ఆ పార్టీ ఖరారు చేసింది. ఈయన అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి. వైసీపీపై ఆయన సుదీర్ఘంగా పోరాటం చేస్తుండటంతో ఆ పార్టీ టికెట్ కేటాయించింది. మరోవైపు ఆలపాటి రాజాకు పెనమలూరు సీటు కేటాయించినట్లు సమాచారం. అలాగే గంటా శ్రీనివాసరావుకు ఆసక్తి లేకపోయినా చీపురుపల్లి స్థానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై TDP అధికారిక ప్రకటన చేయనుంది.
Similar News
News January 8, 2025
ఫార్ములా-ఈ కేసు: నేడు ఇద్దరి నిందితుల విచారణ
TG: ఫార్ములా-ఈ కారు రేసు కేసులో ఇవాళ ఐఏఎస్ అరవింద్ కుమార్, HMDA మాజీ చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డిని ఏసీబీ విచారించనుంది. ఈ కేసులో ఏ2గా అరవింద్, ఏ3గా BLN రెడ్డి ఉన్నారు. HMDA నుంచి FEOకు రూ.45.71 కోట్లు బదిలీ చేయడంపై వీరిని అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్ ఈనెల 9న ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది.
News January 8, 2025
స్నానం ఆపేస్తే ఆయుష్షు 34% పెరుగుతుందా!
చలికాలంలో స్నానం చేయడం మానేస్తే జీవితకాలం 34% పెరుగుతుందనడంలో నిజం లేదని డాక్టర్లు చెప్తున్నారు. ఎప్పుడో ఒకసారి మానేస్తే ఫర్వాలేదంటున్నారు. చల్లదనం వల్ల అసలే మెటాబాలిజం తగ్గుతుందని, స్నానం ఆపేస్తే ఇంకా కష్టమని పేర్కొంటున్నారు. గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల రక్త ప్రవాహం పెరిగి రిలాక్సేషన్ లభిస్తుందని చెప్తున్నారు. జీర్ణక్రియకు తోడ్పడటమే కాకుండా బాడీ హైజీన్ పెంచుతుందని వెల్లడించారు.
News January 8, 2025
వాట్సాప్‌లో ‘ఫొటో పోల్స్’
వాట్సాప్ ‘ఫొటో పోల్స్’ ఫీచర్‌ను తీసుకురానుంది. దీని ద్వారా టెక్స్ట్‌తో అవసరం లేకుండా పోల్స్‌లో ఫొటోలను అటాచ్ చేసేందుకు వీలుంటుంది. ముందుగా ఛానల్స్‌లో అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్‌ను ఆ తర్వాత గ్రూప్ చాట్స్, పర్సనల్ చాట్స్‌లోనూ ప్రవేశపెడతారని వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది. టెక్స్ట్‌లో చెప్పలేని విషయాలను ఫొటోలతో ఈజీగా చెప్పేందుకు ఈ ఫీచర్ సాయపడనుందని పేర్కొంది.