News September 25, 2024
అమరావతిలో MSME శిక్షణ కేంద్రం
AP: అమరావతిలో MSME 2వ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 20 ఎకరాలను కేటాయించింది. దీనిలో టెస్టింగ్ ఫెసిలిటీ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. రూ.250 కోట్ల ఖర్చుతో దీన్ని ప్రతిపాదించగా, 20 ఎకరాల భూములను కేంద్ర MSME డెవలప్మెంట్ కమిషనర్ పేరిట ఉచితంగా బదిలీ చేయనుంది. విశాఖలో ఉన్న మొదటి టెక్నాలజీ సెంటర్లో డిప్లొమా, పోస్ట్ డిప్లొమా, PG డిప్లొమా సహా పలు MSME కోర్సులు అందిస్తోంది.
Similar News
News December 22, 2024
మెగాస్టార్ తర్వాతి సినిమా తమిళ డైరెక్టర్తో?
మెగాస్టార్ చిరంజీవి వరుసగా యువ దర్శకులకు అవకాశాలిస్తున్నారు. వశిష్టతో ‘విశ్వంభర’ రెడీ అవుతుండగా శ్రీకాంత్ ఓదెలతో మూవీకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనిల్ రావిపూడితోనూ ఓ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది. వీరి తర్వాత తమిళ దర్శకుడు మిత్రన్తో మూవీ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆయన కార్తీతో ‘సర్దార్’ సినిమాను తీశారు. మిత్రన్ చెప్పిన స్టోరీ లైన్ చిరుకు నచ్చిందని, పూర్తి కథను డెవలప్ చేయమని సూచించారని సమాచారం.
News December 22, 2024
భారత్పై మరోసారి బంగ్లా ఆరోపణలు
మాజీ ప్రధాని షేక్ హసీనా హయాంలో ప్రజలు అదృశ్యమైన ఘటనల్లో భారత్ హస్తం ఉందని బంగ్లా ప్రభుత్వ ఎంక్వైరీ కమిషన్ ఆరోపించింది. బంగ్లా ఖైదీలు భారతీయ జైళ్లలో మగ్గుతున్నారని పేర్కొంది. భారత్లో నిర్బంధంలో ఉన్న తమ జాతీయులను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని బంగ్లాదేశ్ విదేశాంగ, హోం శాఖలకు కమిషన్ సిఫార్సు చేసింది. తమ పౌరులు 3,500 మంది అదృశ్యమైనట్టు కమిషన్ అంచనా వేసింది.
News December 22, 2024
రైల్వేలో పోస్టులు.. వివరాలివే
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వివిధ విభాగాల్లో 1036 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 7- ఫిబ్రవరి 6 మధ్యలో తమ <