News November 12, 2025
MSTCలో 37 ఉద్యోగాలు

మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ (MSTC) 37మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి BE/ బీటెక్, డిగ్రీ/PG, CA/CMA, MBA, MCA ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ నెల 15 నుంచి 30వరకు అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతం రూ.50వేల నుంచి రూ.1,60,000 చెల్లిస్తారు. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://mstcindia.co.in/
Similar News
News April 4, 2026
గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్‌కూ షూ, బెల్ట్

TG: గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకూ షూ, బెల్ట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఇస్తున్న యూనిఫామ్, నోట్ బుక్స్, పుస్తకాలకు ఇవి అదనం. వీటితో పాటు కొత్తగా బెల్ట్, బ్లాక్ షూ, రెండు జతల సాక్సులను జూన్ 12 నుంచే అందించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు KGBV, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్, మోడల్ స్కూల్ హాస్టల్ విద్యార్థులకు ఎలాంటి వ్యత్యాసం లేకుండా 18రకాల వస్తువులు ఇవ్వనున్నారు.
News April 4, 2026
అగ్నివీర్ రిక్రూట్‌మెంట్.. ఈ నెల 10 వరకు గడువు

ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు ఈ నెల 10 వరకు గడువుంది. 17.5-21 ఏళ్ల వయసున్న అవివాహితులు అర్హులు. నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. జనరల్ డ్యూటీకి టెన్త్‌లో 45%, అగ్నివీర్ టెక్నికల్(MPC)/క్లర్క్/స్టోర్ కీపర్ పోస్టులకు 12thలో 60% మార్కులు వచ్చి ఉండాలి. అప్లికేషన్ ఫీజు ₹250. మరిన్ని వివరాలకు joinindianarmy.nic.in చూడండి.
News April 4, 2026
బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు

ప్రకృతి సేద్యంలో పెద్ద పురుగులు, చీడపీడల నివారణకు బ్రహ్మాస్త్రాన్ని రైతులు ఉపయోగిస్తున్నారు. బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ దేశవాళీ ఆవు లేదా నాటు ఆవు మూత్రం – 10 లీటర్లు
☛ వేప ఆకులు – 2 కిలోలు
☛ సీతాఫలం ఆకులు – 2 కిలోలు
☛ పల్లేరు(బిల్వపత్రం) ఆకులు – 2 కిలోలు
☛ ఉమ్మెత్త ఆకులు – 2 కిలోలు అవసరం.


