News March 19, 2024
MTM: చెత్త కుప్పలో హౌస్ ఫైల్.. విచారణకు ఆదేశించిన కలెక్టర్

మచిలీపట్నంలో జర్నలిస్టుల హౌస్ సైట్స్కు సంబంధించిన, తీర్మాన ఫైల్ చెత్త<<12882516>> కుప్పలో దర్శనమివ్వడంపై<<>> జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ని ఆదేశించారు. నివేశన స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఫైల్ ఆన్లైన్లో బాగ్రత్తగా ఉంటుందని.. ఈ విషయంలో జర్నలిస్టులెవ్వరూ ఆందోళనకు గురి కావద్దని కలెక్టర్ భరోసానిచ్చారు.
Similar News
News April 11, 2025
సమస్యలు తలెత్తకుండా రీ సర్వే: కలెక్టర్ బాలాజీ

ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రీసర్వే ప్రక్రియను సజావుగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. పెదపారుపూడి మండలం పాములపాడులోని గ్రామ రెవెన్యూ అధికారి కార్యాలయం భవనంలో రి సర్వేకు సంబంధించిన రికార్డులను ఆకస్మికంగా గురువారం తనిఖీ చేశారు. గ్రామ పరిధిలో ఇప్పటివరకు పూర్తి చేసిన రిసర్వే ప్రక్రియ తలెత్తిన సమస్యలపై కలెక్టర్ బాలాజీ ఆరాతీశారు.
News April 10, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ కృష్ణా జిల్లాలో నియోజకవర్గానికి ఒక MSME పార్క్ ఏర్పాటు: కలెక్టర్
☞ కేసరపల్లి: చెరువులో పడి మహిళ మృతి
☞12 నుంచి తేలప్రోలు రంగమ్మ పేరంటాలమ్మ తిరునాళ్లు
☞గుడివాడలో ఆర్టీసీ కార్మికుల ధర్నా
☞ఇంతేరు సర్పంచి వైఖరిపై గ్రామస్థులు ఆగ్రహం
☞ పెనమలూరులో ముస్లింల నిరసన ర్యాలీ
☞ నాగాయలంకలో ఫుడ్ సేఫ్టీ అధికారి పేరుతో బెదిరింపులు.
News April 10, 2025
కేసరపల్లి: చెరువులో పడి మహిళ మృతి

గన్నవరం మండలం కేసరపల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న వడ్డెర కుటుంబానికి చెందిన లక్ష్మి(45) కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. బుధవారం ఉదయం కేసరపల్లి చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతిచెందింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.