News May 4, 2024
MTM : బాలశౌరి, కొల్లు రవీంద్రపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
మచిలీపట్నం కూటమి MP, MLA అభ్యర్థులు వల్లభనేని బాలశౌరి, కొల్లు రవీంద్రపై వైసీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా వారిద్దరూ ఈ నెల 2న మచిలీపట్నం పోలీస్ స్టేషన్, జిల్లా ఎస్పీ ఆఫీస్ వద్ద వందలాది మంది కార్యకర్తలతో ధర్నా చేసిన దానిపై ఎన్నికల సంఘం రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శిని కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి ఇరువురిపై చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News November 30, 2024
వేధింపుల నుంచి ఇలా రక్షణ పొందండి: ఎన్టీఆర్ జిల్లా పోలీసులు
ఫొటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని ఎవరైనా వేధిస్తుంటే భయపడవద్దని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు సూచించారు. ఇలాంటి బెదిరింపులు ఎదురైతే https://stopncii.org/ సైట్లో ఫిర్యాదు చేస్తే ఆ ఫొటోలు సోషల్ మీడియా నుంచి తొలగిస్తారన్నారు. ఈ తరహా వేధింపులు ఎదుర్కొంటున్న బాధితులు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో లేదా 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీస్ యంత్రాంగం సూచించింది.
News November 30, 2024
విజయవాడలో నిధి అగర్వాల్..HHVM షూటింగ్ షురూ
పవన్ కళ్యాణ్, నిధిఅగర్వాల్ జంటగా నటిస్తున్న హరిహర వీరమల్లు(HHVM) షూటింగ్‌కి హాజరయ్యే నిమిత్తం నిధిఅగర్వాల్ నగరానికి చేరుకున్నారు. శనివారం ఉదయం ఆమె ‘గుడ్‌మార్నింగ్ విజయవాడ #hhvm’ అంటూ తన ఇన్‌స్టా ఖాతాలో స్టోరీ అప్డేట్ చేశారు. కాగా విజయవాడ పరిసర ప్రాంతాలలో హరిహర వీరమల్లు తుది షెడ్యూల్ షూటింగ్ మొదలైనట్లు తెలుస్తోంది.
News November 30, 2024
కృష్ణా: పలు రైళ్లను దారి మళ్లించిన రైల్వే అధికారులు
గుంతకల్ డివిజన్లో భద్రతా పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా నడిచే పూరి(PURI)- యశ్వంత్‌పూర్(YPR) గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లను రైల్వే అధికారులు దారి మళ్లించారు. ఈ మేరకు నం.22883 PURI- YPR రైలు డిసెంబర్ 6న, నం.22884 YPR-PURI రైలు డిసెంబర్ 7న నంద్యాల-డోన్ మీదుగా కాక నంద్యాల-ఎర్రగుంట్ల మీదుగా అనంతపూర్ వెళుతుందన్నారు. ఈ తేదీల్లో పై 2రైళ్లు డోన్‌లో ఆగవని తెలిపారు.