News February 13, 2025

MTM: వల్లభనేని వంశీ అరెస్ట్.. ఎస్పీ కీలక ప్రకటన 

image

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర రావు కీలక ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌తో పాటు పోలీస్ యాక్ట్‌- 30 అమలులో ఉన్న నేపథ్యంలో నిరసనలు, ర్యాలీలు పూర్తిగా నిషేధమన్నారు. పోలీసుల నిషేధాజ్ఞలను అతిక్రమించి వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. 

Similar News

News October 23, 2025

కృష్ణా: పొలాలపై వరుణుడి ఎఫెక్ట్

image

జిల్లాలో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగిపోయాయి. కంకి దశకు చేరిన వరి పంటలు పాడైపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందే సమయంలో వర్షాలు విరుచుకుపడడంతో నష్టపోతున్నామని వారు ఆందోళన చెందుతున్నారు. వర్షం మరికొన్ని రోజులు కొనసాగితే పంటలు పూర్తిగా నాశనం అయ్యే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు.

News October 23, 2025

కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. వర్షాల కారణంగా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా కంట్రోల్ రూమ్ నెంబర్ 08672-252572 నెంబర్ కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అంతా 24/7 సహాయచర్యలు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు.

News October 23, 2025

కృష్ణా: వర్షంతో రోడ్లు అస్తవ్యస్తం

image

అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పట్టణం, పరిసర గ్రామాల్లో రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. రోడ్లు నీట మునగడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితులు దారుణంగా మారి, వర్షపునీరు, మురుగు కలసి కాలువల నుండి బయటకు పొంగి దుర్వాసన వ్యాపిస్తోంది. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.