News February 27, 2025
MTM: సెయింట్ ఫ్రాన్సిస్లో ఓటు వేసిన కలెక్టర్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలెక్టర్ డీకే బాలాజీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మచిలీపట్నం సెయింట్ జాన్స్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో కలెక్టర్ ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా పోలీసులు పోలింగ్ కేంద్రం వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Similar News
News February 27, 2025
కృష్ణా: ఇప్పటి వరకు 30.59% మేర ఓట్లు పోల్

కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నం 1 2గంటలకు 30.59% ఓట్లు పోలయ్యాయి. జిల్లాలో మొత్తం 63,144 ఓట్లు ఉండగా ఇప్పటి వరకు 19,306 ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
News February 27, 2025
కృష్ణా జిల్లాలో ఓటింగ్ అప్డేట్ ఇదే.!

ఎమ్మెల్సీ ఎన్నికలు కృష్ణాజిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 10 గంటల వరకు 7,859 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.12.45 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అధికారులు సూచించారు. ఓటు హక్కు ప్రజల బాధ్యత అన్నారు.
News February 27, 2025
కృష్ణా: నేడే ఎమ్మెల్సీ పోలింగ్.. ఓటు వేశారా.?

కృష్ణా జిల్లాలో నేడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఈ విధంగా ఉన్నారు. జిల్లాలో మొత్తం 77 పోలింగ్ కేంద్రాలు ఉండగా 63,190 ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 35,378, స్త్రీలు 27,807, ఇతరులు ఐదుగురు ఉన్నారు. నేడు ఎన్నికలు జరగగా.. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. కూటమి అభ్యర్థి అలపాటి రాజేంద్రప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు మధ్య పోటీ ఉండనుంది.