News February 26, 2025

MTM: ప్రారంభమైన పోలింగ్ మెటీరియల్ పంపిణీ 

image

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి పోలింగ్ మెటీరియల్ పంపిణీ ప్రారంభమైంది. స్థానిక నోబుల్ కాలేజ్‌లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ని ఏర్పాటు చేయగా పోలింగ్ కేంద్రాల వారీగా మెటీరియల్ పంపిణీని అధికారులు ప్రారంభించారు. ఈ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. 

Similar News

News February 26, 2025

కృష్ణా జిల్లా ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు: ఎస్పీ

image

కృష్ణా జిల్లా ప్రజలందరికీ, పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఎస్పీ ఆర్. గంగాధర రావు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కృష్ణాజిల్లా పోలీస్ శాఖ తరఫున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులందరి సమక్షంలో సంతోషం జరుపుకోవాలని ఆయన కోరుకుంటున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. 

News February 26, 2025

గుడివాడ: డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్‌ను పరిశీలించిన కలెక్టర్ 

image

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి గుడివాడ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్‌కు తీసుకున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ మెటీరియల్ చేరేలా చూడాలన్నారు. 

News February 26, 2025

కృష్ణా: MLC ఓటు వేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి.!

image

జనరల్ ఎలక్షన్ కంటే ఇవి కొంచెం భిన్నంగా ఉంటాయి. ఓటు వేయడానికి వెళ్లే టప్పుడు ఓటు స్లిప్‌తో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు తీసుకువెళ్లాలి. పోలింగ్ కేంద్రంలో ఓటరుకు బ్యాలెట్ పేపర్‌ను ఇస్తారు. అందులో అభ్యర్థుల పేర్లతో పాటు ఫొటోలు ఉంటాయి. పోలింగ్ సిబ్బంది ఇచ్చిన పెన్నుతో మీరు ఎంచుకున్న అభ్యర్థికి ప్రాధాన్యత ఇచ్చేలా 1 అని నంబర్ మాత్రమే వేయాలి. అక్షరాల్లో రాస్తే ఓటు చెల్లదు. 

error: Content is protected !!