News January 7, 2025
MTM: వసతి గృహంలో కలెక్టర్ పుట్టిన రోజు వేడుకలు
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సాంఘిక సంక్షేమ వసతి గృహం విద్యార్థినుల సమక్షంలో తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. మచిలీపట్నం బచ్చుపేటలోని వసతి గృహాన్ని సందర్శించిన ఆయన విద్యార్థినులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఎగ్జామ్ ప్యాడ్, పెన్, స్కేల్, జామెంట్రీ బాక్స్, కొబ్బరి నూనె, ఫేస్ పౌడర్, హెయిర్ పిన్స్, టవల్, నాప్కిన్‌లతో కూడిన కిట్స్‌ను అందజేశారు.
Similar News
News January 8, 2025
కృష్ణా: బీ-ఫార్మసీ పరీక్షల టైం టేబుల్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో బీ-ఫార్మసీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ నెల 28,30, ఫిబ్రవరి 1,3 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకై https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
News January 8, 2025
కలంకారీ క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్
పెడనలో కలంకారీ క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పెడన కలంకారీ ఆర్టిజాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో కలెక్టర్‌ను కలిసి పెడనలో ఏర్పాటు చేయనున్న కలంకారీ క్లస్టర్ గురించి చర్చించారు.
News January 8, 2025
కృష్ణా: రూ.4,612 కోట్ల పనులకు మోదీ ప్రారంభోత్సవాలు
విశాఖపట్నంలో నేడు బుధవారం పర్యటించనున్న ప్రధాని మోదీ పలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని మచిలీపట్నం- గుడివాడ- భీమవరం- నిడదవోలు రైల్వేలైన్ డబ్లింగ్, విద్యుదీకరణ చేసిన లైన్లను నేడు ఆయన లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదే విధంగా విజయవాడ- గుడివాడ- భీమవరం- నరసాపురం రైల్వే లైన్‌ను రూ.4,612 కోట్లతో చేపట్టగా ఆ లైన్‌లను మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.