News May 3, 2024

MTM: వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు

image

జనసేన నేత కర్రి మహేశ్ ఇంటిపై దాడి కేసులో మచిలీపట్నం YCP MLA అభ్యర్థి పేర్ని కిట్టుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కిట్టుతో పాటు మరో ఐదుగురు YCP నేతలపై కూడా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కిట్టుని A1గా చూపగా చిలకలపూడి గాంధి, చిలంకుర్తి వినయ్, శీనయ్య, ధనబాబు, లంకే రమేశ్‌లను A2, A3, A4, A5గా చూపారు. ఇదే కేసులో కర్రి మహేశ్‌తో పాటు మరో ముగ్గురిపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. 

Similar News

News October 31, 2025

కృష్ణా జిల్లాలో పలు మండలాలకు క్రీడా సామాగ్రి సరఫరా

image

కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, మొవ్వ, పమిడిముక్కల, ఉయ్యూరు మండలాల క్లస్టర్ పాఠశాలలకు క్రీడా పరికరాలు సరఫరా చేయనున్నట్లు ఏపీ సమగ్ర శిక్ష అధికారులు కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శులు రాంబాబు, అరుణ తెలిపారు. సంబంధిత మండలాల పీఈటీలు వారి క్లస్టర్‌కు కేటాయించిన స్పోర్ట్స్ మెటీరియల్‌ను స్వీకరించుటకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

News October 30, 2025

కృష్ణా: ఉద్యాన పంటలపై మొంథా పంజా

image

మొంథా తుపాన్ ఉద్యాన పంటల రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం.. జిల్లాలో 1416 హెక్టార్లలో ఉద్యాన పంటలు (అరటి, మొక్కజొన్న, పసుపు, చెరకు తదితరాలు) దెబ్బతిన్నాయి. ఈ పంటలపై ఆధారపడిన 2,229 మంది రైతులు రూ. 73.46 కోట్ల మేర నష్టపోయినట్టు అధికారులు ప్రాథమిక అంచనాలు తయారు చేశారు.

News October 30, 2025

కోడూరు: పవన్ పంట పొలాలను పరిశీలించే స్థలం ఇదే.?

image

తుపాన్ కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. కోడూరు మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణాపురం ఆర్సీఎం చర్చి వద్ద తుపాన్ తాకిడికి నేలకి వోరిగిన వరిపైరును పరిశీలించనున్నారు. వ్యవసాయ అధికారులు తుపాన్ నష్టాన్ని అంచనా వేసి పవన్‌కి వివరించనున్నారు. పోలీస్ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.