News March 27, 2025
MTM: హత్య కేసును ఛేదించిన పోలీసులు

ఇనుగుదురుపేట వర్రిగూడెంలో ఈ నెల 21న సంచలనం సృష్టించిన టోపీ శీను హత్య కేసును మచిలీపట్నం పోలీసులు ఛేదించారు. బుధవారం ఇనుగుదురుపేట పోలీస్ స్టేషన్‌లో బందర్ డీఎస్పీ సీహెచ్ రాజా మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ఇల్లీగల్ కేసుకు సంబంధించి హత్య జరిగిన నాలుగు రోజుల్లోనే 9 మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న కడవకొల్లు దయాకర్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News March 30, 2025
కృష్ణా: UG పరీక్షా ఫలితాలు విడుదల

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన UG 3వ, 5వ సెమిస్టర్ పరీక్షల రీ వాల్యుయేషన్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
News March 30, 2025
కృష్ణా: రేపటి నుంచి పెరగనున్న పాల ధరలు

విజయ పాల ధరను పెంచుతూ కృష్ణామిల్క్ యూనియన్(విజయ డెయిరీ) నిర్ణయం తీసుకున్నట్లు ఛైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. ఈ పెరిగిన ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. విజయ డెయిరీలోని గోల్డ్ పాల ధర ప్రస్తుతం లీటరు రూ.74 ఉండగా తాజాగా పెరిగిన ధరతో రూ.76 కానుంది. ఫుల్ క్రీమ్ లీటరు రూ.72 నుంచి 74 పెరిగినట్లు వెల్లడించారు. కావున ప్రజలు సహకరించాలని కోరారు.
News March 30, 2025
నేడు ఆత్కూర్ స్వర్ణ భారత్‌కు చంద్రబాబు

సీఎం చంద్రబాబు ఆదివారం కృష్ణా జిల్లాకు రానున్నారు. ఉంగుటూరు మండలంలోని ఆత్కూర్ స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమక్షంలో ఉగాది సంబరాలు జరగనున్నాయి. సాయంత్రం 4 గంటలకు జరిగే సంబరాలకు ముఖ్య అతిథిగా చంద్రబాబు పాల్గొననున్నారు. కాగా ఇప్పటికే అధికారులు ఏర్పాట్లను పూర్తిచేశారు.