News March 20, 2025
MTM: ‘ఉద్యోగులు కర్మ యోగి భారత్ ఆన్ లైన్ శిక్షణ పూర్తి చేయాలి’

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ఉద్యోగులందరూ ఈ నెల 26వ తేదీలోగా కర్మయోగి భారత్ ఆన్ లైన్ శిక్షణ పూర్తి చేసుకుని ధృవీకరణ పత్రం తప్పనిసరిగా పొందాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా అధికారులతో ఐ గాట్ కర్మయోగి భారత్ శిక్షణ కార్యక్రమంపై వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
Similar News
News March 28, 2025
కృష్ణాజిల్లాలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ల నియామకం

కృష్ణాజిల్లాలో 4 మార్కెట్ యార్డుల ఛైర్మన్లను ప్రభుత్వం శుక్రవారం నియమించింది. గుడ్లవల్లేరు మార్కెట్ యార్డు ఛైర్మన్ పొట్లూరి రవి కుమార్ (టీడీపీ), కంకిపాడు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ అన్నే ధనరామ కోటేశ్వరరావు(టీడీపీ), ఘంటసాల మార్కెట్ యార్డ్ ఛైర్మన్ తోట కనకదుర్గ (జనసేన), మొవ్వ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ దోనేపూడి శివరామయ్య (బీజేపీ) నియమితులయ్యారు.
News March 28, 2025
తిరువూరులో వేడెక్కుతున్న రాజకీయం

AMC మాజీ ఛైర్మన్ రమేశ్ రెడ్డికి స్థానిక ఎంపీ మద్దతు ఉందని ఎమ్మెల్యే కొలికపూడి నిన్న ఆరోపించారు. రమేశ్‌పై పార్టీ నాయకులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఎమ్మెల్యే తెలుపగా..రూ.2 కోట్లు అడిగితే తాను ఇవ్వకపోవడంతో కొలికపూడి తనపై నిందలు వేస్తున్నారని రమేశ్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో తిరువూరులో MP Vs MLAగా వివాదం తీవ్రమవుతోంది. ఆరోపణలు చేసేవారు ఓపెన్ డిబేట్‌కి రావాలని MLA సవాల్ విసిరారు.
News March 28, 2025
VJA: యువకుడిపై దాడి.. డబ్బుతో పరార్

ఓ ఆటోలో ఇద్దరు వ్యక్తులు కలిసి విజయవాడ బస్టాండ్ వద్దకు వచ్చి ఓ యువకుడితో అమ్మాయి ఉందని రేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ మేరకు ఉండవల్లి సమీపంలో పొలాల వద్దకు వచ్చారు. అక్కడ యువకుడి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారు. పని అయ్యాక విజయవాడలో వదిలిపెట్టాలని కోరాడు. దీంతో ఆటోకి రూ.1500ఇవ్వాలని యువకుడిపై దాడి చేసి, జేబులోని డబ్బు లాక్కెళ్లారు. యువకుడు ఫిర్యాదుకు వెళ్తే పోలీసులు మందలించి పంపారు.