News July 17, 2024
ముచ్చుమర్రి ఘటన.. CI, SIపై వేటు

AP: ముచ్చుమర్రి ఘటనకు సంబంధించి స్థానిక సీఐ, ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు పడింది. నందికొట్కూరు రూరల్ సీఐ విజయ్ భాస్కర్, ముచ్చుమర్రి ఎస్ఐ జయశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు చర్యలు తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకే వారిపై వేటు వేసినట్లు డీఐజీ తెలిపారు. కాగా ముచ్చుమర్రిలో ఎనిమిదేళ్ల చిన్నారిని ముగ్గురు మైనర్లు అత్యాచారం, హత్య చేసి మృతదేహాన్ని కృష్ణా నదిలో పడేశారు.
Similar News
News January 13, 2026
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

<
News January 13, 2026
కవిత కాంగ్రెస్‌లో చేరడం లేదు: పీసీసీ చీఫ్

TG: జాగృతి చీఫ్ కవిత కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారంలో వాస్తవం లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మాజీ సీఎం కూతురుగా ఆమె చేస్తున్న విమర్శలపై BRS స్పందించాలన్నారు. మహిళా అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంత్రుల శాఖల విషయంలో సీఎం జోక్యం లేదని, అందరికీ పూర్తి స్వేచ్ఛనిచ్చారని మీడియా చిట్‌చాట్‌లో తెలిపారు.
News January 13, 2026
కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించిన చద్దా

క్విక్ కామర్స్ సంస్థల ‘10 నిమిషాల డెలివరీ’ విధానాన్ని కేంద్రం <<18845524>>తొలగించడంపై<<>> ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా సంతోషం వ్యక్తం చేశారు. ‘సత్యమేవ జయతే.. అంతా కలిస్తేనే ఈ విజయం సాధ్యమైంది’ అంటూ X వేదికగా ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇది డెలివరీ బాయ్స్‌పై ఉండే ఒత్తిడిని తగ్గిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో పార్లమెంటులో కూడా గిగ్ వర్కర్ల భద్రతపై ఆయన <<18483406>>గళమెత్తి<<>> వారికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.


