News September 28, 2024
MUDA SCAM: సిద్దరామయ్యపై FIR నమోదు

ముడా స్కామ్ కేసులో కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై లోకాయుక్త పోలీసులు FIR రిజిస్టర్ చేశారు. IPC 351, 420, 240, 09, 120B సెక్షన్లను ప్రయోగించారు. సిద్దరామయ్య భార్య పార్వతి, బావమరిది, ఇతరుల పేర్లను అందులో మెన్షన్ చేశారు. బెంగళూరులోని స్పెషల్ కోర్టు ఆదేశాల మేరకు లోకాయుక్త ఈ చర్యలు చేపట్టింది. రూ.56 కోట్ల విలువైన 14 సైట్లను పార్వతికి ముడా కేటాయించడంతో సీఎం అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
Similar News
News January 23, 2026
లిక్కర్ స్కామ్.. ముగిసిన మిథున్రెడ్డి విచారణ

AP: లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. 7 గంటలపాటు హైదరాబాద్ ఈడీ ఆఫీసులో అధికారులు ఆయనను విచారించారు. మిథున్రెడ్డి వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేశారు. అనంతరం ఆయన ఇంటికి వెళ్లిపోయారు. నిన్న విజయసాయిరెడ్డిని ఇదే కేసులో అధికారులు 7 గంటలపాటు విచారించిన సంగతి తెలిసిందే.
News January 23, 2026
వృద్ధాప్యానికి చెక్ పెట్టొచ్చు: ఎలాన్ మస్క్

మరణాన్ని, వృద్ధాప్యాన్ని అడ్డుకోవచ్చని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. వయసుని తగ్గించడం కూడా సాధ్యమేనని అన్నారు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఆయన మాట్లాడారు. శరీరంలోని అన్ని భాగాలు ఒకేసారి ముసలితనం వైపు వెళ్తున్నాయంటే దానికి ఒక కారణం తప్పకుండా ఉంటుందన్నారు. అయితే మనిషి ఎక్కువ కాలం జీవిస్తే క్రియేటివిటీ తగ్గి సమాజంలో వచ్చే మార్పులు ఆగిపోవచ్చని మస్క్ అభిప్రాయపడ్డారు.
News January 23, 2026
INDvsNZ 4వ T20.. టికెట్లు విడుదల

భారత్-న్యూజిలాండ్ మధ్య 28వ తేదీన జరగనున్న 4వ T20కి టికెట్లు విడుదలయ్యాయి. ఏపీ విశాఖలోని ACA-VDCA క్రికెట్ స్టేడియంలో బుధవారం రాత్రి 7గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లు district యాప్లో అందుబాటులో ఉన్నాయి.


