News September 26, 2024
MUDA SCAM: నేనెందుకు రిజైన్ చేయాలంటున్న సిద్దరామయ్య

ముడా స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిద్దరామయ్య CM పదవికి రిజైన్ చేయనని తెగేసి చెప్పారు. BJP నేతల విమర్శలపై ఇలా స్పందించారు. ‘అసలు నేనెందుకు రిజైన్ చేయాలి? HD కుమారస్వామి పైనా ఆరోపణలు ఉన్నాయి. మరి ఆయన రిజైన్ చేశారా? మోదీతో ఆయన్ను రిజైన్ చేయించమనండి’ అని ఎదురు ప్రశ్నించారు. ఇదంతా పొలిటికల్ డ్రామా అని, బీజేపీ నేతలు, కేంద్రమంత్రుల్లో చాలా మందిపై కేసులున్నాయని డిప్యూటీ CM శివకుమార్ ఆరోపించారు.
Similar News
News December 5, 2025
క్షమాపణ కోరిన రంగనాథ్

TG: హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు హాజరయ్యారు. బతుకమ్మ కుంట వివాదంలో న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించినందుకు క్షమాపణ కోరారు. ఆ స్థలంలో యథాతథస్థితి కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులివ్వగా రంగనాథ్ ఉల్లంఘించారంటూ సుధాకర్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించినా కమిషనర్ వెళ్లలేదు. దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించడంతో రంగనాథ్ కోర్టుకు వెళ్లారు.
News December 5, 2025
పెళ్లి వయసు రాకున్నా సహజీవనం చేయొచ్చు: రాజస్థాన్ హైకోర్టు

చట్టబద్ధంగా పెళ్లి వయస్సు రాకున్నా పరస్పర అంగీకారంతో సహజీవనం చేసే హక్కు ఇద్దరు మేజర్లకు ఉందని రాజస్థాన్ హైకోర్టు స్పష్టం చేసింది. live-inలో ఉన్న తమకు రక్షణ కల్పించాలని కోటాకు చెందిన యువతి(18), యువకుడు(19) కోర్టును ఆశ్రయించారు. వారు చట్టప్రకారం పెళ్లి చేసుకోలేనంత మాత్రాన ప్రాథమిక హక్కులను కోల్పోకూడదని జస్టిస్ అనూప్ తీర్పుచెప్పారు. చట్ట ప్రకారం పురుషుల పెళ్లి వయసు 21 కాగా, మహిళలకు 18 ఏళ్లు ఉండాలి.
News December 5, 2025
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ 6 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 22వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి లైఫ్ సైన్స్ /బయో టెక్నాలజీ/కెమికల్ /కంప్యూటేషనల్ & ఇన్ఫర్మేషన్ /ఫార్మాస్యూటికల్/వెటర్నరీ విభాగంలో పీహెచ్డీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.nii.res.in


