News October 19, 2024

జనసేనలోకి ముద్రగడ కూతురు

image

AP: వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి ఇవాళ సా.4 గంటలకు జనసేన పార్టీలో చేరనున్నారు. పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఆమెకు కండువా కప్పి ఆహ్వానించనున్నారు. ఆమెతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు నుంచి పలువురు నేతలు పార్టీలో చేరనున్నారు.

Similar News

News December 5, 2025

బాలానగర్: ఉద్యోగాన్ని వదిలి.. సర్పంచి బరిలో..!

image

బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లికి చెందిన అంగన్వాడీ కార్యకర్త గాయత్రి ఇటీవలే ఉద్యోగానికి రాజీనామా చేశారు. పెద్దాయపల్లి సర్పంచ్ పదవి ఎస్సీ రిజర్వేషన్ కావడంతో పోటీ చేసేందుకు గురువారం స్థానిక దేవాలయంలో పూజలు నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. ఈమె భర్త లక్ష్మయ్య గతంలో పెద్దాయపల్లి ఎంపీటీసీగా పనిచేశారు. ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నడంతో హాట్ టాపిక్‌గా మారింది.

News December 5, 2025

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీలో ఉద్యోగాలు

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ 6 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 22వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి లైఫ్ సైన్స్ /బయో టెక్నాలజీ/కెమికల్ /కంప్యూటేషనల్ & ఇన్‌ఫర్మేషన్ /ఫార్మాస్యూటికల్/వెటర్నరీ విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.nii.res.in

News December 5, 2025

అందుకే IPLకు గుడ్‌బై చెప్పా: ఆండ్రీ రస్సెల్‌

image

వెస్టిండీస్‌ స్టార్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్‌ IPLకు <<18429844>>గుడ్‌బై<<>> చెప్పిన కారణాన్ని తాజాగా వెల్లడించారు. “ఐపీఎల్‌ ప్రపంచంలోనే అతి పెద్ద టోర్నీ. ప్రయాణాలు, వరుస మ్యాచ్‌లు, ప్రాక్టీస్‌, జిమ్‌ వర్క్‌లోడ్‌ శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం సవాలుతో కూడుకున్నది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింట్లోనూ నేను ప్రభావం చూపాలి. కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా కొనసాగాలని అనుకోవడం లేదు” అని తెలిపారు.