News March 25, 2025
రేపు OTTలోకి వచ్చేస్తున్న ‘ముఫాసా’

ది లయన్ కింగ్ మూవీకి ప్రీక్వెల్‌గా వచ్చిన ‘ముఫాసా’ మూవీ రేపు ఓటీటీలోకి రానుంది. జియో హాట్‌స్టార్‌లో తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ, తమిళంలో స్ట్రీమింగ్ కానుంది. కాగా తెలుగులో ముఫాసాకు మహేశ్ బాబు, హిందీలో షారుఖ్ ఖాన్ డబ్బింగ్ చెప్పారు. డిస్నీ రూపొందించిన ఈ మ్యూజికల్ లైవ్ యాక్షన్ మూవీ గతేడాది విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Similar News
News March 28, 2025
మతం విషయంలో నా తల్లిదండ్రులకు సమస్య రాలేదు: సల్మాన్ ఖాన్

తన తల్లిదండ్రుల వివాహంలో హిందూ-ముస్లిం అనే తేడా ఎప్పుడూ రాలేదని సల్మాన్ ఖాన్ అన్నారు. వారికి వృత్తిపరమైన సమస్య తప్ప వేరే ఏది ఉండేది కాదని పేర్కొన్నారు. సికందర్ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ విషయాల్ని మీడియాతో పంచుకున్నారు. సల్మాన్ ఖాన్ తల్లిదండ్రులు సలీమ్, సుశీల 1964లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం సల్మా ఖాన్‌గా సుశీల పేరు మార్చుకున్నారు.
News March 28, 2025
భూకంపం నుంచి తప్పించుకున్న తెలంగాణ MLA ఫ్యామిలీ

బ్యాంకాక్‌లో భూకంపం నుంచి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కుటుంబం త్రుటిలో తప్పించుకుంది. రాజ్ ఠాకూర్ భార్య, కూతురు, అల్లుడు బ్యాంకాక్ పర్యటనకు వెళ్లారు. అక్కడ భారీ భూకంపం ధాటికి అనేక బిల్డింగులు కుప్పకూలాయి. అయితే ఆ ముగ్గురికి ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. వారు తిరిగి విమానాశ్రయానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే మాత్రం హైదరాబాద్‌లోనే ఉన్నారు.
News March 28, 2025
కుప్పకూలిన 1000 పడకల ఆసుపత్రి.. భారీగా క్షతగాత్రులు

భూకంప తీవ్రతకు మయన్మార్ రాజధాని నేపిడాలో 1,000 పడకల ఆసుపత్రి కుప్పకూలింది. ఇందులో పెద్ద ఎత్తున క్షతగాత్రులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మండలే నగరంలో ఒక వంతెన కూలిపోయింది. పలు చోట్ల ఎత్తైన భవనాలు, గుళ్లు నేలకొరిగాయి. ఇప్పటి వరకూ 55మంది మృతి చెందినట్లు అధికారులు తెలుపగా సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. బ్యాంకాక్‌లో భారీ భవనం కూలడంతో ముగ్గురు మృతి చెందగా పదుల సంఖ్యలో శిథిలాల కింద చిక్కుకున్నారు.