News August 21, 2024
ఈనెల 26న ‘ముఫాసా: ది లయన్ కింగ్’ తెలుగు ట్రైలర్!

‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రానికి సంబంధించిన టైటిల్ రోల్‌కు సూపర్ స్టార్ మహేశ్‌బాబు వాయిస్ అందిస్తున్నారు. ఇప్పటికే వాయిస్ ఓవర్ పూర్తయిందని, ఈనెల 26న ఉదయం 11.07 గంటలకు ట్రైలర్ రిలీజ్ కానుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 20న ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. హిందీ వెర్షన్‌కు షారుఖ్ ఖాన్ తన కుమారులు ఆర్యన్ ఖాన్, ఖాన్‌తో కలిసి డబ్బింగ్ చెప్పారు.
Similar News
News February 1, 2026
ఫోన్లు ట్యాప్ చేసి ప్రముఖులను బ్లాక్‌మెయిల్ చేశారు: TPCC చీఫ్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో KCR సిట్ విచారణ నేపథ్యంలో BRSపై TPCC చీఫ్ మహేశ్ గౌడ్ ఘాటుగా స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, గతంలో అనేకమంది CMలు విచారణ ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ట్యాపింగ్‌ను అడ్డం పెట్టుకొని బిల్డర్లు, సినీ ప్రముఖులను బ్లాక్ మెయిల్ చేశారని, వందలాది మంది వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూశారని ఆరోపించారు. KCR ఆదేశాలు లేకుండా ఇంతపెద్ద ఎత్తున ట్యాపింగ్ జరగడం సాధ్యం కాదన్నారు.
News February 1, 2026
Apocalypto యాక్టర్ కన్నుమూత

ప్రముఖ మెక్సికన్ యాక్టర్ గెరార్డో తరసేనా(55) కన్నుమూశారు. ఆయన మరణానికి గల కారణాలు తెలియరాలేదు. Apocalypto, మ్యాన్ ఆన్ ఫైర్, ది మెక్సికన్ సినిమాలు, నార్కోస్ వెబ్ సిరీస్ ద్వారా ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. కెరీర్‌లో దాదాపు 50 చిత్రాలు, టీవీ సిరీస్‌లలో నటించారు.
News February 1, 2026
నిద్రలేమితో హెయిర్ ఫాల్

నిద్ర లేమి వల్ల శరీరంలో కార్టిసోల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఈ హార్మోన్ స్థాయి పెరిగినప్పుడు.. అది నేరుగా జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అధిక కార్టిసోల్ జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది. దీని కారణంగా.. కుదుళ్లకు సరైన పోషణ అందక జుట్టు రాలడం మొదలవుతుంది. అంతేకాకుండా అసంపూర్తి నిద్ర జుట్టును బలహీనపరచడమే కాకుండా.. తల చర్మాన్ని కూడా పాడు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.


