News November 1, 2024
Muhurat Trading 2024: లాభాలతో ఆరంభం
దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త ఏడాదిని లాభాలతో ప్రారంభించాయి. దీపావళి సందర్భంగా శుక్రవారం సాయంత్రం జరిగిన ముహూరత్ ట్రేడింగ్లో సెంటిమెంట్ ప్రకారం ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. దీంతో సెన్సెక్స్ 335 పాయింట్ల లాభంతో 79,724 వద్ద, నిఫ్టీ 99 పాయింట్ల లాభంతో 24,304 వద్ద స్థిరపడ్డాయి. బ్యాంకింగ్ మొదలుకొని హెల్త్కేర్ వరకు అన్ని రంగాలు గ్రీన్లో ముగిశాయి. IT స్వల్ప నష్టాలు చవిచూసింది.
Similar News
News November 1, 2024
వేడి నూనె పాత్రలో పడ్డ ఫోన్.. బ్యాటరీ పేలి వ్యక్తి మృతి
వంట చేస్తూ చేతిలో పట్టుకున్న ఫోన్ వ్యక్తి ప్రాణం తీసింది. మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో ఓ వ్యక్తి వంట చేస్తున్న సమయంలో చేతిలో ఉన్న ఫోన్ జారి వేడివేడి నూనె పాత్రలో పడింది. దీంతో ఒక్కసారిగా బ్యాటరీ పేలడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం గ్వాలియర్ తరలిస్తుండగా సింధ్ నదిపై ట్రాఫిక్ జాంతో అంబులెన్స్ ఆలస్యంగా ఆస్పత్రికి చేరుకుంది. బాధితుడు అప్పటికే మృతి చెందాడు.
News November 1, 2024
టీటీడీ పాలకమండలిలో మరికొందరికి చోటు
AP: బీఆర్ నాయుడు ఛైర్మన్గా 24 మందితో ఏర్పాటైన టీటీడీ పాలకమండలిలో ప్రభుత్వం మరో ఐదుగురికి చోటు కల్పించింది. జి.భాను ప్రకాశ్ రెడ్డిని సభ్యుడిగా, దేవదాయ శాఖ సెక్రటరీ, కమిషనర్, TUDA ఛైర్మన్, TTD ఈవోలను ఎక్స్అఫిషియో మెంబర్లుగా పాలకమండలిలోకి తీసుకున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది.
News November 1, 2024
కాంగ్రెస్ గ్యారంటీల మోసం క్షమించరానిది: కేటీఆర్
TG: గాలి మాటల గ్యారంటీలిస్తే మొదటికే మోసం వస్తుందని AICC ఛైర్మన్ మల్లికార్జున ఖర్గేకు ఇప్పుడు అర్థమైనట్లు ఉందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. కర్ణాటక, తెలంగాణలో ఆరు గ్యారంటీలు ప్రకటించినప్పుడు బడ్జెట్ గుర్తుకురాలేదా? అని ఆయనను నిలదీశారు. ‘కాంగ్రెస్ ఆడిన గ్యారంటీల గారడీతో రాష్ట్రం ఆగమైంది. ప్రజలను గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన మోసం క్షమించరానిది’ అని ఆయన ట్వీట్ చేశారు.