News November 1, 2024
సాయంత్రం 6 నుంచి 7 వరకు ముహూరత్ ట్రేడింగ్
స్టాక్ మార్కెట్లకు నేటి సాయంత్రం ముహూరత్ ట్రేడింగ్తో కొత్త ఏడాది ప్రారంభంకానుంది. NSE, BSEలో సాయంత్రం 6 నుంచి 7 వరకు ట్రేడింగ్ జరగనుంది. పండుగ సందర్భంగా ముహూరత్ ట్రేడింగ్లో కొత్తగా పెట్టే పెట్టుబడులు రాబోయే రోజుల్లో అధిక రాబడులు ఇస్తాయని ఇన్వెస్టర్లు విశ్వసిస్తారు. దీర్ఘకాలంలో వృద్ధికి అవకాశం ఉండి అందుబాటు ధరలో ఉన్న స్టాక్స్ను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News November 1, 2024
కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులపై కీలక ప్రకటన
APలో త్వరలో కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనిపై కార్యాచరణ రూపొందిస్తామని, అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. SKLM(D) ఈదుపురం సభలో ఆయన ప్రసంగించారు. ‘విశాఖ రైల్వే జోన్కు లైన్ క్లియర్ చేశాం. రేపో, ఎల్లుండో భూమిపూజ చేస్తాం. టెక్కలి/పలాసలో ఎయిర్పోర్టు తీసుకొస్తాం. మూలపేటలో 10వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తాం’ అని హామీ ఇచ్చారు.
News November 1, 2024
దుల్కర్-సాయి పల్లవి కాంబోలో తెలుగు మూవీ?
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి కాంబోలో ఓ మూవీ తెరకెక్కనుంది. వైజయంతి మూవీస్ నిర్మించనున్న ‘ఆకాశంలో ఒక తార’ అనే తెలుగు సినిమాలో వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటించనున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు వెల్లడించాయి. కాగా, దుల్కర్ ‘లక్కీ భాస్కర్’, సాయి పల్లవి నటించిన ‘అమరన్’ నిన్న విడుదలైన విషయం తెలిసిందే.
News November 1, 2024
అన్నక్యాంటీన్లలో ఉచిత భోజనం అందించే ఆలోచన: గంటా
AP: స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో ఉన్నామని టీడీపీ MLA గంటా శ్రీనివాసరావు అన్నారు. ఉక్కు పరిశ్రమపై ఇప్పటికే ప్రధాని మోదీతో చంద్రబాబు మాట్లాడారని చెప్పారు. అవసరమైతే మరోసారి ఢిల్లీ వెళ్లి కేంద్రంతో మాట్లాడుతామని తెలిపారు. భవిష్యత్తులో అన్న క్యాంటీన్లలో భోజనం ఉచితంగా అందించే ఆలోచన ఉందని వెల్లడించారు. విశాఖకు మరిన్ని IT కంపెనీలు తీసుకొచ్చేలా మంత్రి లోకేశ్ కృషి చేస్తున్నారని అన్నారు.