News March 30, 2024
మాల్దీవుల మాజీ అధ్యక్షుడిపై ముయిజ్జు తీవ్ర ఆగ్రహం

మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలిహ్పై ప్రత్యక్షంగా, భారత్పై పరోక్షంగా ప్రస్తుత అధ్యక్షుడు ముయిజ్జు తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ఇబ్రహీం అధికారంలో ఉన్న సమయంలో వారికి పార్లమెంటులో అత్యధిక మెజారిటీ ఉంది. కానీ దేశ స్వతంత్రతను కాపాడటంతో విఫలమయ్యారు. భద్రతను విదేశీ పాలకుల చేతిలో పెట్టారు. ఆ రాయబారుల ఆదేశాలకు అనుగుణంగా పాలించారు. దానివల్ల కోలుకోలేని విధ్వంసం జరిగింది’ అని మండిపడ్డారు.
Similar News
News November 20, 2025
త్వరలో రెస్టారెంట్లు, సొసైటీల్లో ఎంట్రీకి ఆధార్!

ఆధార్ విషయంలో త్వరలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెస్టారెంట్లలో లైవ్ ఈవెంట్కు వెళ్లాలన్నా, హౌసింగ్ సొసైటీల్లోకి ఎంట్రీ కావాలన్నా, ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా మీ గుర్తింపు కోసం ఆధార్ చూపించాల్సి రావొచ్చు. ఆఫ్లైన్ ఆధార్ వాడకాన్ని పెంచాలనే ఉద్దేశంతో UIDAI ఈ తరహా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వ్యక్తుల ప్రైవసీకి కూడా ఇది ఉపయోగపడుతుందని ఆ సంస్థ చెబుతోంది.
News November 20, 2025
TMC-HBCHలో ఉద్యోగాలు

విశాఖపట్నంలోని <
News November 20, 2025
శబరిమల బంగారం చోరీ కేసులో మరో అరెస్ట్

శబరిమల ఆలయ బంగారం చోరీ కేసులో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(TDB) మాజీ ప్రెసిడెంట్, CPM మాజీ ఎమ్మెల్యే పద్మా కుమార్ను సిట్ అరెస్ట్ చేసింది. ఆలయం నుంచి కొన్ని విగ్రహాల బంగారు తాపడం చోరీకి గురవడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో పద్మ కుమార్ను అధికారులు ఇవాళ ఉదయం నుంచి కొన్ని గంటల పాటు ప్రశ్నించారు. ఆ తర్వాత అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో TDB మాజీ కమిషనర్తో పాటు పలువురు అరెస్ట్ అయ్యారు.


