News November 1, 2024

ఆపద్బాంధవుడవయ్యా ముకేశ్!

image

ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా-ఏ కేవలం 107 రన్స్‌కే ఆలౌటైన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం సాధించి గెలవడం పక్కా అనే దశలో భారత పేసర్ ముకేశ్ కుమార్ ఆపద్బాంధవుడయ్యారు. 46 పరుగులిచ్చి 6 కీలక వికెట్లు పడగొట్టారు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ముకేశ్ రాణింపుతో భారీ లీడ్ తప్పింది.

Similar News

News November 21, 2025

ఎన్ఫోర్స్మెంట్‌ను మరింత కఠినతరం: మంత్రి పొన్నం

image

రవాణా శాఖలో ఎన్ఫోర్స్మెంట్‌ను మరింత కఠినతరం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఎన్ఫోర్స్మెంట్ కోసం కొత్తగా ఏర్పడిన 33 జిల్లా స్థాయి బృందాలు, 3 రాష్ట్ర స్థాయి ఫ్లైయింగ్ స్క్వాడ్ నిరంతర తనిఖీలు చేపట్టాలన్నారు. 10 రోజుల వ్యవధిలో కొత్తగా ఏర్పడిన బృందాల ద్వారా రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 4748 కేసుల నమోదు చేశారన్నారు.

News November 21, 2025

రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు!

image

TG: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఏ గ్రామానికి ఏ రిజర్వేషన్ దక్కుతుందనే చర్చ మళ్లీ మొదలైంది. గతంలో ఉన్న రిజర్వేషన్లు మారనున్నాయి. జనాభా ప్రాతిపదికన వీటిని ఖరారు చేయనున్నారు. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇప్పుడున్న కేటగిరీకి కాకుండా మరో కేటగిరీకి ఛాన్స్ రానుంది. దీనిపై రేపు వెలువడే జీవోతో క్లారిటీ రానుంది. రాష్ట్రంలో 12,760గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి.