News April 3, 2024
ముకేశ్ అంబానీనే మళ్లీ టాప్!

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఫోర్బ్స్ జాబితాలో మరోసారి రిచెస్ట్ ఏషియన్గా నిలిచారు. ఆయన సంపద $83 బిలియన్ల నుంచి $116 బిలియన్లకు పెరిగింది. $100 బిలియన్ల సంపద కలిగిన ఏకైక ఆసియా దేశస్థుడిగా ఆయన నిలిచారు. భారతీయ బిలియనీర్లలో ఆయన తర్వాత స్థానంలో గౌతమ్ అదానీ ($84 బిలియన్లు) ఉన్నారు. మరోవైపు గత ఏడాది 169గా ఉన్న భారతీయ బిలియనీర్ల సంఖ్య 200కు చేరింది.
Similar News
News October 26, 2025
RTC, ప్రైవేట్ బస్సులకు తేడా ఏంటి?

ఆర్టీసీలో ట్రైనింగ్ తీసుకున్న డ్రైవర్లు ఉంటారు. డ్యూటీకి ముందు ప్రతి డిపోలో ఆల్కహాల్ టెస్టు చేస్తారు కాబట్టి మద్యం తాగి బస్సు నడిపే అవకాశం ఉండదు. బస్సుకు స్పీడ్ లాక్ ఉండటంతో గంటకు 80 కి.మీ. వేగాన్ని దాటి వెళ్లలేదు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ప్రైవేట్ బస్సు డ్రైవర్లు రాత్రి వేళ్లలో గంటకు 120 కి.మీ. వేగంతో వెళ్తారు. డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యం తాగే అవకాశమూ ఉంది.
News October 26, 2025
DRDOలో ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నారా?

<
News October 26, 2025
నల్లరంగు వల్ల బైకును గుర్తించలేకపోయా: డ్రైవర్

AP: రోడ్డుపై పడిన <<18102090>>బైక్<<>> నల్లరంగులో ఉండటంతో దూరం నుంచి సరిగా గుర్తించలేకపోయానని వేమూరి కావేరి బస్సు డ్రైవర్ లక్ష్మయ్య పోలీసులకు చెప్పాడు. వర్షంలో సడెన్ బ్రేక్ వేస్తే ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశంతో ఆపకుండా బైకుపై నుంచి బస్సును పోనిచ్చినట్లు తెలిపాడు. కాగా ఈ ప్రమాదానికి ముందు 3 బస్సులు ఆ బైకును గుర్తించి పక్క నుంచి వెళ్లినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లే.


