News May 10, 2024

పోస్టల్ బ్యాలెట్‌ వివరాలు వెల్లడించిన ముఖేశ్ కుమార్

image

AP: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా తాజాగా వెల్లడించారు. ‘నిన్నటితో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో 25 పార్లమెంటు స్థానాలకు 4,44,216 ఓట్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 4,44,218 ఓట్లు పోలయ్యాయి. పార్లమెంటరీ నియోజకవర్గాల్లో నెల్లూరులో అత్యధికంగా 22,650 ఓట్లు పోలయ్యాయి. అత్యల్పంగా అమలాపురం(ఎస్సీ)లో 14,526 ఓట్లు పోలయ్యాయి’ అని వివరించారు.

Similar News

News December 1, 2025

పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై ప్రత్యేక పన్ను!

image

పొగాకు, పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై ప్రత్యేక పన్నులు విధించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు-2025, నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు-2025ను ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాక పొగాకు, పొగాకు ప్రొడక్టులపై జీఎస్టీతోపాటు ఎక్సైజ్ లెవీని విధిస్తారని తెలుస్తోంది. పాన్ మసాలా తయారీపై జీఎస్టీతోపాటు కొత్త సెస్‌ విధించనున్నట్లు సమాచారం.

News December 1, 2025

ఇంతకన్నా శుభకరమైన రోజు ఉంటుందా?

image

శివకేశవుల అనుగ్రహాన్ని పొందడానికి నేడు చాలా అనుకూలమైన, శుభకరమైన రోజని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది శివకేశవులకు ఎంతో ఇష్టమైన మార్గశిర మాసం. అందులోనూ నేడు పరమ శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం, విష్ణు పూజలకు పవిత్రంగా భావించే సర్వ ఏకాదశి కలిసి వచ్చాయి. ఈ కలయికకు తోడుగా ఈరోజే గీతా ఆవిర్భవించింది. అందుకే ఈ రోజున ధర్మకార్యాలు చేస్తే ఆ పుణ్యఫలం జన్మజన్మల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు.

News December 1, 2025

పువ్వుల సాగు- మంచి ధర రావాలంటే మొక్కలు ఎప్పుడు నాటాలి?

image

పువ్వుల సాగులో లాభాలు రావాలంటే పంట నాటే సమయం కీలకం. దీని కోసం మార్చి, ఏప్రిల్ నెలల్లో మొక్కలను నాటుకోవడం మేలని.. హార్టికల్చర్ నిపుణులు, పువ్వుల సాగులో మంచి దిగుబడి సాధిస్తున్న రైతులు చెబుతున్నారు. ఇలా నాటితే జూన్ నుంచి పువ్వుల కాపు మొదలవుతుందని, జులై నుంచి ప్రారంభమయ్యే పండుగల నాటికి మంచి దిగుబడి వస్తుందని చెబుతున్నారు. అప్పుడు డిమాండ్‌ను బట్టి విక్రయిస్తే మంచి లాభం పొందవచ్చంటున్నారు.