News August 15, 2024

సూపర్-6 పథకాల అమలుకు షణ్ముఖ వ్యూహం: పవన్

image

AP: సమరయోధుల బాటలో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సుపరిపాలనను అందిస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ చెప్పారు. కాకినాడలో మాట్లాడుతూ..‘సూపర్-6 అమలుకు షణ్ముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నాం. సామాజిక పింఛన్ల మొత్తాన్ని పెంచాం. ఉచితంగా ఇసుక అందిస్తున్నాం. డొక్కా సీతమ్మ పేరిట స్కూళ్లలో మధ్యాహ్న భోజనం, NTR స్ఫూర్తితో పేదలకు రూ.5కే భోజనం కార్యక్రమాలు అమలు చేస్తున్నాం’ అని తెలిపారు

Similar News

News January 20, 2025

పంచాయతీ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు: Dy.CM పవన్

image

AP: గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందేలా చూడాలని అధికారులను Dy.CM పవన్ ఆదేశించారు. పంచాయతీల క్లస్టర్ విధానంలో మార్పులు చేపట్టి, కొత్త గైడ్‌లైన్స్‌ను రూపొందించాలన్నారు. క్లస్టర్ గ్రేడ్ల విభజనకు ఆదాయం, జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు. క్లస్టర్ల విభజన, గ్రేడ్ల కేటాయింపుపై కమిటీని ఏర్పాటు చేయాలని, కమిటీ నివేదిక ప్రకారం పంచాయతీ, సచివాలయ సిబ్బందిని కేటాయించాలన్నారు.

News January 20, 2025

సంభల్ అల్లర్లు: పాక్ కుట్రపై డౌట్!

image

సంభల్ అల్లర్లలో పాక్ కుట్రకోణంపై డౌట్ వస్తోంది. తుపాకీతో కాల్పులు జరిపిన ముల్లా అఫ్రోజ్‌కు దావూద్ ఇబ్రహీం గ్యాంగుతో సంబంధాలు బయటపడటమే ఇందుకు కారణం. లగ్జరీ కార్ల చోరీ మాస్టర్ మైండ్ షారిక్ షాటా తరఫునే తానీ పనిచేసినట్టు అఫ్రోజ్ అంగీకరించాడు. అతడు కాల్చిన .32 పిస్టల్ బుల్లెట్లు పాక్‌లో తయారైనవే. షారిక్‌కు ISI, D గ్యాంగుతో లింక్ ఉన్నట్టు తెలిసింది. ఇక సంభల్ కేసులో 70 మందిని అరెస్టు చేయడం తెలిసిందే.

News January 20, 2025

₹17 లక్షల పరిహారం ఇవ్వాలన్న జడ్జి.. అవసరం లేదన్న పేరెంట్స్

image

ట్రైనీ వైద్యురాలి హత్యాచార కేసు తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి అనిర్బన్ దాస్ పరిహారంపై సైతం ఆదేశాలిచ్చారు. బాధిత కుటుంబానికి బెంగాల్ ప్రభుత్వం రూ.17 లక్షలు పరిహారం ఇవ్వాలని తీర్పులో పేర్కొన్నారు. అత్యంత అరుదైన ఈ కేసులో ఉరి శిక్ష విధించాలని CBI లాయర్ వాదించారు. కానీ దీన్ని అత్యంత అరుదైన కేసుగా పరిగణించలేమని జడ్జి తెలిపారు. అటు తమకు పరిహారం అవసరం లేదని అభయ తండ్రి ప్రకటించారు.