News July 2, 2024
ములుగు జిల్లాకు ‘సమ్మక్క, సారలమ్మ’ పేరు

TG: ములుగు జిల్లా పేరును ‘సమ్మక్క, సారలమ్మ’ గా మార్చేందుకు మంత్రి సీతక్క విజ్ఞప్తితో రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పేరు మార్పుపై అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు రేపు గ్రామ సభలు నిర్వహించనున్నారు. ప్రజల నుంచి తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో లిఖిత పూర్వకంగా స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. జిల్లా పేరు మార్పుపై మీరేమంటారు?
Similar News
News December 6, 2025
సత్తుపల్లి: అక్రమ వేట.. మాజీ MLA సోదరుడి కుమారుడి అరెస్టు

సత్తుపల్లిలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ వేట కార్యకలాపాలపై టాస్క్‌ఫోర్స్, అటవీ శాఖ సంయుక్తంగా మెరుపు దాడి నిర్వహించి నలుగురిని అరెస్టు చేసింది. అరెస్టైన వారిలో మాజీ MLA మెచ్చా నాగేశ్వరరావు సోదరుడి కుమారుడు రఘు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం పట్టుబడిన రఘు, మరో నిందితుడు కుంజా భరత్‌లను కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. అడవి జంతువులను వేటాడితే కఠిన చర్యలు ఉంటాయని DFO హెచ్చరించారు.
News December 6, 2025
BSBD అకౌంట్లు.. ఇక నుంచి ఫ్రీగా..

బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) అకౌంట్లకు RBI గుడ్ న్యూస్ చెప్పింది.
*డిజిటల్ ట్రాన్సాక్షన్లపై నో లిమిట్
*అన్‌లిమిటెడ్ డిపాజిట్లు. నో డిపాజిట్ ఫీజు
*నెలకు 4 ఫ్రీ ATM విత్‌డ్రాలు, ఉచితంగా ATM/డెబిట్ కార్డు (వార్షిక ఫీజు లేకుండా)
*ఏడాదికి 25 చెక్ లీఫ్స్, ఫ్రీగా పాస్‌బుక్/స్టేట్‌మెంట్స్
>BSBD అంటే జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్. APR 1, 2026 నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.
News December 6, 2025
శరీరాకృతికి తగ్గ దుస్తులు వేసుకుంటేనే..

కొంతమందికి మంచి పర్సనాలిటీ ఉన్నా ఎంత మంచి దుస్తులు వేసుకున్నా ఆకర్షణీయంగా ఉండరు. అందుకే మన దుస్తుల ఎంపిక మనసుకు నచ్చినట్లు మాత్రమే కాకుండా, శరీరాకృతికి తగ్గట్లుగా దుస్తుల ఎంపిక ఉండాలంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. మన శరీర ప్రత్యేకతను ముందుగా గుర్తించాలి. అలాగే లోపంగా అనిపించే ప్రాంతాన్నీ తెలుసుకోగలగాలి. రెండింటినీ సమన్వయం చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఫ్యాషన్ క్వీన్‌లా మెరిసిపోవచ్చంటున్నారు.


