News November 24, 2024
స్టార్ బౌలర్‌ను కొన్న ముంబై ఇండియన్స్

IPL: వేలంలో లేటుగా ఎంట్రీ ఇచ్చిన ముంబై స్టార్ బౌలర్ బౌల్ట్‌ను సొంతం చేసుకుంది. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్ ఉన్న అతడిని రూ.12.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ న్యూజిలాండ్ పేసర్ IPLలో 103 మ్యాచులు ఆడి 121 వికెట్లు పడగొట్టారు. గతంలో ముంబై, రాజస్థాన్ తరఫున ఆడారు. ఆరంభంలోనే వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బతీయడం ఇతడికి వెన్నతో పెట్టిన విద్య. MIలో బుమ్రాకు బౌల్ట్ తోడవడంతో బౌలింగ్ స్ట్రాంగ్ అయింది.
Similar News
News January 30, 2026
రోజుకు లక్షన్నర బ్యారెల్స్.. రష్యా నుంచి ఇండియాకు!

రష్యా నుంచి పెద్దమొత్తంలో క్రూడాయిల్‌ను రిలయన్స్ సంస్థ కొనుగోలు చేయనుంది. ఫిబ్రవరి నుంచి రోజూ సుమారు 1.5 లక్షల బ్యారెల్స్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటామని కంపెనీ చెప్పిందని రాయిటర్స్ తెలిపింది. అమెరికా ఆంక్షల లిస్టులో లేని రష్యన్ కంపెనీల నుంచి రానున్న 2 నెలలు కొననుందని వెల్లడించింది. US ఆంక్షల నుంచి మినహాయింపు తీసుకుని డిసెంబర్‌లోనూ రష్యా క్రూడ్‌ను కొనిందని చెప్పింది.
News January 30, 2026
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీలో పోస్టులు

<
News January 30, 2026
ఫిబ్రవరి 3న ఏపీ క్యాబినెట్ భేటీ

AP: వచ్చే నెల 3న క్యాబినెట్ సమావేశం కానుంది. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఫిబ్రవరి 11 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలతో పాటు కీలక ఇష్యూలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 28న మంత్రివర్గ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. వారం రోజుల వ్యవధిలోనే మరోసారి క్యాబినెట్ భేటీ నిర్వహిస్తుండడం విశేషం.


