News October 30, 2024
ముంబై ఇండియన్స్ రిటెన్షన్ వీరే?

ముంబై ఇండియన్స్ తమ రిటెన్షన్ జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యతోపాటు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ, నమన్ ధీర్లను ఆ ఫ్రాంచైజీ అట్టిపెట్టుకుందని సమాచారం. రేపు బీసీసీఐకి ఈ జాబితాను సమర్పించనుంది. కాగా గెరాల్డ్ కొయెట్జీ, డెవాల్డ్ బ్రెవిస్, ఇషాన్ కిషన్, అర్జున్ టెండూల్కర్ తదితరులను వదులుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Similar News
News November 25, 2025
నల్గొండ: రైతు భరోసా కోసం రైతుల ఎదురుచూపులు

నల్గొండ జిల్లాలో యాసంగి పంట సాగుకు సిద్ధమవుతున్న 10.82 లక్షల మంది రైతులు రైతు భరోసా పథకం పెట్టుబడి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వానాకాలం, యాసంగి పంటలకు కలిపి ప్రభుత్వం ఏటా రూ.12,000 అందిస్తుంది. అయితే, ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో విడుదల కావాల్సిన ఈ యాసంగి సహాయం ఇప్పటివరకు రాకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.
News November 25, 2025
ఆకుకూరల సాగు- అనువైన నేలలు, వాతావరణం

తక్కువ సమయంలో రైతు చేతికొచ్చి, నిరంతరం ఆదాయం అందించే పంటల్లో ఆకుకూరలు ముందుంటాయి. ఆకుకూరలను మురుగు నీరు ఇంకిపోయే అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. నేల ఉదజని సూచిక 6.0 నుంచి 7.5గా ఉండాలి. వానాకాలం, వేసవి కాలం, 16 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న సమయం ఆకుకూరల పంటలు పెరగడానికి అత్యంత అనుకూలం. 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటే తోటకూరను సాగు చేయడం కష్టం.
News November 25, 2025
మేము లడ్డూ క్వాలిటీ విషయంలో రాజీపడలేదు: సజ్జల

AP: వైసీపీని టార్గెట్ చేస్తూ తిరుమల లడ్డూ విచారణ జరుగుతోందని వైసీపీ నేత సజ్జల అన్నారు. ‘కల్తీ నెయ్యి విచారణ పారదర్శకంగా జరగడం లేదు. మేము లడ్డూ క్వాలిటీ విషయంలో రాజీపడలేదు. సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అప్పుడు ఇవే కంపెనీలు, ఇప్పుడూ ఇవే కంపెనీలు నెయ్యి సప్లై చేస్తున్నాయి.. నెయ్యి కల్తీకి ఎక్కడ అవకాశం ఉంది’ అని ప్రెస్ మీట్లో ప్రశ్నించారు.


