News March 28, 2024
రెండుగా చీలిపోయిన ముంబై ఇండియన్స్?

ముంబై ఇండియన్స్ జట్టులో అనిశ్చితి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ జట్టు 2 వర్గాలుగా చీలిపోయినట్లు సమాచారం. కెప్టెన్ హార్దిక్ పాండ్య, ఇషాన్ కిషన్ ఓ వైపు.. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ మరోవైపు ఉన్నట్లు టాక్. కానీ హార్దిక్ వర్గానికి ఫ్రాంచైజీ యాజమాన్యం మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. వరుస ఓటములతో డీలా పడ్డ ముంబై జట్టులో ఇలాంటి వాతావరణం కనిపించడం ఫ్యాన్స్‌ను కలవరపరుస్తోంది.
Similar News
News April 6, 2026
TODAY HEADLINES

*ఎన్నికల్లో గెలిచాక టీఎంసీ పాపాల లెక్క తేలుస్తాం: మోదీ
*నీటి సంరక్షణ కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్: CBN
*కోర్టు అన్ని వర్గాల ప్రజలకు పవిత్ర స్థలం: సీఎం రేవంత్
*అసలు సినిమా ముందుంది: రాఘవ్ చడ్ఢా
*హార్ముజ్‌ను దాటిన 9వ భారత నౌక
*డీల్ చేసుకోకుంటే.. మొత్తం ఇరాన్‌నే నాశనం చేస్తా: ట్రంప్
*IPL: SRHపై LSG, చెన్నైపై బెంగళూరు గెలుపు
News April 6, 2026
ఫైటర్ జెట్ కూలిపోయింది కానీ పైలట్లు సేఫ్: US

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో తమ <<19559906>>F-15E<<>> ఫైటర్ జెట్ కూలిపోయిందని అమెరికా ధ్రువీకరించింది. అందులోని ఇద్దరు పైలట్లు ఇరాన్ భూభాగంలో పడిపోగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించి విజయవంతంగా వారిని రక్షించామని తెలిపింది. ఇరాన్‌పై తమ దాడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కాగా పైలట్లను రక్షించే క్రమంలో అమెరికా పలు ఎయిర్ క్రాఫ్ట్‌లను కోల్పోయింది.
News April 6, 2026
డీల్ చేసుకోకుంటే.. మొత్తం ఇరాన్‌నే నాశనం చేస్తా: ట్రంప్

ఇరాన్‌తో యుద్ధం త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. 48 గంటల డెడ్‌లైన్‌ను 82 గంటలకు పొడిగించినట్లు తెలిపారు. మంగళవారం 8 గంటల్లోపు(అమెరికా కాలమానం ప్రకారం) డీల్ చేసుకోవాలని ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ ఒప్పందం చేసుకోకపోతే మొత్తం ఇరాన్‌నే నాశనం చేస్తానని హెచ్చరించారు. దేశంలో పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిలు అంటూ ఏవీ మిగలవని స్పష్టంచేశారు.


