News April 18, 2024
టాస్ ఓడిన ముంబై
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
ముంబై: రోహిత్, ఇషాన్ (WK), సూర్య, తిలక్, హార్దిక్ (C), టిమ్ డేవిడ్, నబీ, రొమారియో షెపర్డ్, శ్రేయస్ గోపాల్, గెరాల్డ్ కొయెట్జీ, బుమ్రా.
పంజాబ్: రూసో, ప్రభ్సిమ్రాన్, సామ్ కరన్ (సి), లివింగ్‌స్టోన్, జితేశ్ (WK), శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్, రబాడ.
Similar News
News November 18, 2024
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడి అరెస్ట్
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికాలో అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ముంబైలో పొలిటికల్ పార్టీ యాక్టివిటీస్‌లో అతడు జోక్యం చేసుకుంటున్నట్టు NIA ఈమధ్యే గమనించింది. అతడి సమాచారమిస్తే రూ.10 లక్షల బౌంటీ ఇస్తామని ప్రకటించింది. యాక్టర్ సల్మాన్ ఇంటిపై కాల్పుల కేసులో అన్మోల్ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు.
News November 18, 2024
రోహిత్ నిర్ణయాన్ని 100 శాతం సపోర్ట్ చేస్తా: ట్రావిస్ హెడ్
రెండోసారి తండ్రయిన రోహిత్ శర్మ భార్య, బిడ్డలతో గడపడానికి BGT తొలి టెస్టుకు దూరమయ్యారు. ఈ నిర్ణయాన్ని తాను 100 శాతం సపోర్ట్ చేస్తానని ఆసీస్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ వెల్లడించారు. ఆ పరిస్థితుల్లో తాను ఉన్నా అదే పనిచేస్తానన్నారు. ‘క్రికెటర్లుగా మేం ఎన్నో త్యాగాలు చేస్తాం. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ముఖ్యమైన ఘట్టాలకు దూరమవుతాం. ఆ సమయం మళ్లీ తిరిగిరాదు’ అని పేర్కొన్నారు.
News November 18, 2024
గ్రేడ్-1 ఫీజు రూ.4.20 లక్షలు!
పిల్లలకు మంచి చదువును అందించాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. అయితే, ఆ చదువిప్పుడు కాస్ట్లీగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. తన కుమార్తె గ్రేడ్ 1 ఫీజు చూసి షాక్ అయ్యానని ఆయన చెప్పారు. రిజిస్ట్రేషన్ ఛార్జీ రూ.2వేలు, అడ్మిషన్ ఫీజు రూ.40వేలు, వార్షిక ఫీజు రూ.2.52 లక్షలు, బస్ ఫీజు రూ.1.08 లక్షలు, స్టేషనరీకి రూ.20వేలు ఇలా మొత్తంగా ఫీజు రూ.4.20లక్షలని తెలిపారు.