News May 4, 2024
ఇప్పటికీ ముంబై ప్లేఆఫ్స్‌కు వెళ్లే ఛాన్స్.. ఎలాగంటే?
IPLలో ముంబై ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశం ఇప్పటికీ ఉంది. ప్రస్తుతం ముంబై 11 మ్యాచుల్లో 3 విజయాలతో 6 పాయింట్లు సాధించింది. మిగిలిన 3 మ్యాచుల్లో తప్పకుండా గెలవాలి. అప్పుడు 12 పాయింట్స్ వస్తాయి. SRH (12 పాయింట్లు), లక్నో (12 పాయింట్లు) మిగతా మ్యాచులు ఓడిపోవాలి. అంతేకాదు RR, KKR కాకుండా మిగిలిన అన్ని జట్లు 12 పాయింట్లు సాధించకూడదు. వీటితో పాటు NRR కూడా ఎక్కువగా ఉంటే హార్దిక్ సేన ప్లేఆఫ్స్‌కు వెళ్తుంది.
Similar News
News December 31, 2024
తెలంగాణ సిఫార్సు లేఖలపై చంద్రబాబు కీలక నిర్ణయం
AP: తిరుమలకు తెలంగాణ నేతల నుంచి వచ్చే సిఫార్సు లేఖల్ని ఆమోదించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈమేరకు ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. చంద్రబాబు నిర్ణయానికి రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. MLA/MLC/MP నుంచి సోమవారం నుంచి గురువారం మధ్యలో ఏవైనా 2 రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనానికి 2 లేఖలు, స్పెషల్ ఎంట్రీ దర్శనానికి 2 లేఖలు స్వీకరిస్తామని లేఖలో చంద్రబాబు తెలిపారు.
News December 31, 2024
స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై కేసు కొట్టివేత
TG: స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై 2019లో నమోదైన కేసును హైకోర్టు తాజాగా కొట్టివేసింది. ఆ ఏడాది ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో వికారాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆయన చేసిన దీక్ష నియమాల ఉల్లంఘన కిందికే వస్తుందని పేర్కొంటూ అప్పట్లో ఆయనపై కేసు నమోదైంది. దానిపై ప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా విచారణ జరిపిన ధర్మాసనం, కేసును కొట్టివేస్తున్నట్లు తీర్పునిచ్చింది.
News December 31, 2024
2015 తర్వాత తొలిసారిగా ఢిల్లీలో ‘స్వచ్ఛ’ డిసెంబర్!
2015 తర్వాత వచ్చిన డిసెంబర్లలో ఢిల్లీలో అత్యంత తక్కువ కాలుష్యం ఈ ఏడాది డిసెంబరులోనే నమోదైందని ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. ఈ నెల ప్రథమార్ధంలో బలమైన గాలులు, ద్వితీయార్థంలో రికార్డు స్థాయి వర్షాలు దీని వెనుక కారణాలని వివరించారు. ఇప్పటికీ ఏక్యూఐ ప్రమాదకర స్థాయిలోనే.. అంటే 295 పాయింట్ల వద్ద ఉంది. గుడ్డికంటే మెల్ల మిన్న అన్నట్లుగా ఈ 9ఏళ్లలో ఇది కొంచెం బెటర్ అయిందనేది అధికారుల ప్రకటనలో సారాంశం.