News April 24, 2024
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై

RRvsMI మ్యాచ్‌లో ముంబై జట్టు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంది.
>> జట్లు
MI: రోహిత్‌శర్మ, ఇషాన్, సూర్యకుమార్, తిలక్ వర్మ, హార్దిక్(C), టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, కోయెట్జీ, నబీ, పీయూష్ చావ్లా, బుమ్రా.
ఇంపాక్ట్ ప్లేయర్‌గా నువాన్ తుషారాను MI ప్రకటించింది.
RR: జైస్వాల్, శాంసన్(C), పరాగ్, హెట్మెయర్, జురెల్, పావెల్, రవిచంద్రన్ అశ్విన్, బౌల్ట్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ.
Similar News
News January 26, 2026
కట్టె జనుము పంటకు ఈ దశలో నీటి తడులు తప్పనిసరి

వరి మాగాణిలో కట్టె జనుము పంటను సాగు చేస్తే మొదటి తడి అవసరం లేకుండా విత్తనాలు మొలకెత్తుతాయి. అయితే పంట మొలిచాక తొలి దశలో అనగా 25 రోజులకు, పూత, విత్తనం ఏర్పడే దశలో పంటను నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. అవసరాన్ని బట్టి పంట కాలంలో రెండు నుంచి 3 నీటి తడులను అందిస్తే మంచి దిగుబడి సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News January 26, 2026
CCRHలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి(CCRH) 40 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, M.Pharm/MVSc, PG, MLT, PhD, ME/MTech, BE/BTech, NET/GPAT/GATE/RET ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి 10, 11, 12, 13, 16, 17, 18, 24, మార్చి10తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్సైట్: ccrhindia.ayush.gov.in
News January 26, 2026
ప్రభుత్వ సేవల్లోనూ ఏఐ పాత్ర పెరగాలి: సీఎం

AP: పాలనలో టెక్నాలజీని వినియోగించి ఉద్యోగులపై పని భారం తగ్గించాలని CM చంద్రబాబు అధికారులకు సూచించారు. RTGSపై సమీక్షలో ఆయన మాట్లాడారు. 2026ను టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్‌గా మార్చాలన్నారు. ప్రభుత్వ సేవల్లోనూ AI పాత్ర పెరగాలని స్పష్టం చేశారు. వాట్సాప్ గవర్నెన్స్‌తో 878 సేవలు అందుతున్నాయని, ఇప్పటివరకు 1.43 కోట్ల మంది వినియోగించుకున్నారని అధికారులు సీఎంకు వివరించారు.


