News March 27, 2024

మునావర్ ఫరూఖీ అరెస్ట్

image

స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్‌బాస్-17 విజేత మునావర్ ఫరూఖీని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని బోరా బజార్‌లో ఉన్న ఓ హుక్కా పార్లర్‌పై అర్ధరాత్రి రైడ్ చేసి, అతనితో సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. హెర్బల్ హుక్కా ముసుగులో పొగాకు ఆధారిత హుక్కా వాడుతున్నారన్న సమాచారం రావడంతో రైడ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పొగాకు హుక్కా పీల్చినట్లు తేలితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News January 16, 2026

110 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

పుదుచ్చేరిలోని <>JIPMER<<>> 110 Sr. రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల వారు FEB 3 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, MD/MS/DNB/జనరల్ మెడిసిన్/DM/MCh/MDS అర్హతతో పాటు పనిఅనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.1,30,000 చెల్లిస్తారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://jipmer.edu.in

News January 16, 2026

ఆయుధం పట్టకుండా జ్ఞాన యుద్ధం చేసిన విదురుడు

image

మహాభారతంలో విదురుడు ఆయుధం పట్టకుండానే జ్ఞాన యుద్ధం చేశారు. కత్తి కంటేమాట పదునైనదని నమ్మి, తన వాక్చాతుర్యంతో కురువంశాన్ని కాపాడేందుకు నిరంతరం శ్రమించారు. ధృతరాష్ట్రుడి అంధకార బుద్ధికి దిక్సూచిగా ఉంటూ, దుర్యోధనుడి దురాలోచనలను ముందే పసిగట్టి హెచ్చరించారు. ధర్మం వైపు నిలబడి ఆయన చేసిన ప్రతి సూచన అహంకారంపై సాగిన భీకర పోరాటం. దుర్మార్గంపై ధర్మం సాధించే నిశ్శబ్ద గెలుపును విదురుని జీవితం మనకు చెబుతుంది.

News January 16, 2026

రూ.238కోట్లు కలెక్ట్ చేసిన ‘రాజాసాబ్’

image

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కించిన ‘రాజాసాబ్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల్లో రూ.238కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘కింగ్ సైజ్ బ్లాక్‌బస్టర్’ అంటూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. సంక్రాంతి సందర్భంగా ఈనెల 9న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ తెచ్చుకున్న విషయం తెలిసిందే. తమన్ మ్యూజిక్ అందించారు.