News October 14, 2024

మునావ‌ర్ ఫారూఖీ హ‌త్య కుట్ర.. భ‌గ్నం!

image

స్టాండ‌ప్ క‌మేడియ‌న్ మునావ‌ర్ ఫారూఖీ హ‌త్య‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ Sepలో చేసిన కుట్ర‌ను నిఘా వ‌ర్గాలు భ‌గ్నం చేసిన‌ట్టు తెలుస్తోంది. ఢిల్లీలో జ‌రిగిన ఓ కాల్పుల కేసు విచారణలో ఈ కుట్ర వివరాలు వెలుగుచూశాయి. అయితే, అప్పటికే ఢిల్లీ వెళ్తున్న మునావర్‌పై విమానంలో, హోట‌ల్‌లో రెక్కీ జ‌రిగిన‌ట్టు పోలీసులు గుర్తించారు. ఇది కచ్చితంగా అతని హత్యకు జరిగిన కుట్రగా భావించి మునావర్‌ను అక్కడి నుంచి తప్పించారు.

Similar News

News October 14, 2025

మామిడి రైతులకు డబ్బులు విడుదల

image

AP: తోతాపురి మామిడి విక్రయించిన రైతులకు ప్రభుత్వం నగదు విడుదల చేసింది. 40,795 మంది రైతుల ఖాతాల్లో రూ.185.02 కోట్ల సబ్సిడీని జమ చేసింది. ప్రమాదవశాత్తు చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలకూ ఎక్స్‌గ్రేషియా నిధులు రిలీజ్ చేసింది. గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద 19 జిల్లాల్లో 106 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.5.30కోట్లు జమ చేసింది.
* రోజూ అగ్రికల్చర్ వార్తల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి..

News October 14, 2025

పూజకు పూలు లేనప్పుడు ఏం చేయాలి?

image

పూజ సమయంలో పూలు లేకపోతే చాలామంది వాటి బదులు అక్షింతలు కలిపి పూజ చేస్తుంటారు. అయితే పూలను అక్షింతలతో కలిపి పూజించవద్దని పండితులు చెబుతున్నారు. దీనివల్ల విఘ్నాలు వస్తాయని అంటున్నారు. ఒకవేళ ఇంట్లో ఒకటి, రెండు పూలు మాత్రమే ఉంటే.. వాటిని ముందు దేవుడి పాదాల వద్ద ఉంచి, ఆ తర్వాత అక్షింతలను సమర్పించాలి. పూలు లేనప్పుడు కేవలం అక్షింతలతో పూజ చేసినా శుభ ఫలితం దక్కుతుందని శాస్త్రాలు సూచిస్తున్నాయి. <<-se>>#POOJA<<>>

News October 14, 2025

NABARDలో ఉద్యోగాలు

image

నాబార్డ్ 6 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ( BCA, IT), ME, M.TECH, MCA, MBA, CA, PGDM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.150. వెబ్‌సైట్: https://www.nabard.org/