News October 7, 2025

డిసెంబర్ లేదా జనవరిలో మున్సిపల్ ఎన్నికలు?

image

TG: డిసెంబర్ లేదా జనవరిలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. GHMC పరిధి మున్సిపాలిటీలతో పాటు మరో 10 స్థానాలకు ఇంకా గడువు పూర్తి కాలేదు. అవి మినహా మిగిలిన 123 స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో ఇప్పటికే వార్డుల విభజన పూర్తయింది. కొత్త మున్సిపాలిటీలు ఇంద్రేశం, జిన్నారంతో పాటు ఇస్నాపూర్, గజ్వేల్‌‌లో వార్డుల విభజనకు త్వరలో షెడ్యూల్ రానుంది.

Similar News

News October 7, 2025

DGEMEలో 194 పోస్టులు

image

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్(DGEME)194 గ్రూప్ సీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఇంటర్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ఈ నెల 24వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: indianarmy.nic.in

News October 7, 2025

అమెనోరియా సమస్యకు కారణమిదే!

image

నెలసరి సమయానికి రాకపోవడాన్ని అమెనోరియా అంటారు. నెలసరి లేటుగా మొదలవడాన్ని ప్రైమరీ అమెనోరియా, రెగ్యులర్‌గా పీరియడ్స్ రాకపోవడాన్ని సెకండరీ అమెనోరియా అని అంటారు. వంశపారంపర్యం, PCOS, ఈటింగ్ డిజార్డర్ వల్ల ఈ సమస్య వస్తుంది. ప్రారంభంలోనే చికిత్స చేయించుకోకపోతే గర్భసంచి, గుండె, బోలు ఎముకల వ్యాధులు వచ్చే ప్రమాదముంది.
✍️ ప్రతిరోజూ మహిళలు, చైల్డ్ కేర్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> కేటగిరీలోకి వెళ్లండి.

News October 7, 2025

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో ప్రధానులెవరు?

image

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ప్రధాన దైవాలుగా మనం కొలుస్తాం. వీరిలో ఎవరు ప్రధానం అనే ప్రశ్నకు జవాబు యుగాలను బట్టి మారుతుంది. బ్రహ్మ కల్పంలో బ్రహ్మే ప్రధానం. శివ కల్పంలో శివుడే ప్రధానం. దేవి కల్పంలో దేవియే ప్రధానం. అయితే ఇప్పుడు నడుస్తున్నది శ్వేత వరాహ కల్పం. అందువల్ల ఈ కల్పంలో విష్ణుమూర్తియే ప్రధాన దైవం. అనేక అవతారాలు ధరిస్తూ ఆయన తన సృష్టిని కాపాడుతూ, ధర్మాన్ని నిలబెడుతున్నాడు. <<-se>>#WhoIsGod<<>>