News June 18, 2024
ఇండియాలో మురళీధరన్ భారీ పెట్టుబడులు

శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ఇండియాలో భారీ పెట్టుబడులు పెడుతున్నారు. రూ.1,400 కోట్లతో కర్ణాటకలోని చామరాజనగర్‌లో ‘ముత్తయ్య బేవరేజెస్ అండ్ కన్ఫెక్షనరీస్’ పేరుతో డ్రింక్స్, స్వీట్స్ తయారీ సంస్థను నెలకొల్పుతున్నారు. ఇందుకు కర్ణాటక ప్రభుత్వం ఆయనకు 46 ఎకరాల భూమిని కూడా కేటాయించింది. 2025 జనవరి నాటికి ఈ సంస్థను ప్రారంభించనున్నారు. అలాగే ధార్వాడ్‌లోనూ మరో యూనిట్ నెలకొల్పాలని యోచిస్తున్నారు.
Similar News
News January 26, 2026
సోమవారం నాడు ఇలా చేస్తే.. శివానుగ్రహం!

సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు. పార్వతీదేవి 16 సోమవారాలు ఉపవాసంతో శివుని అనుగ్రహం పొందిందని పురాణాల వాక్కు. ఈరోజు భక్తులు బిల్వపత్రాలతో పూజించి, రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు తొలగి కోరికలు నెరవేరాలంటే శివ పూజ సమయంలో ‘శివ చాలీసా’ పఠించడం శ్రేయస్కరం. ఉదయం లేదా సాయంత్రం భక్తితో శివ చాలీసా పఠిస్తే శివుని కృప కలిగి జీవితంలోని సమస్యలన్నీ గట్టెక్కుతాయని పండితులు సూచిస్తున్నారు.
News January 26, 2026
రికార్డు సృష్టించిన టీమ్ ఇండియా

ICC ఫుల్ మెంబర్ టీమ్‌పై 150+ టార్గెట్‌ను అత్యధిక బాల్స్ (60) మిగిలి ఉండగానే ఛేదించిన జట్టుగా టీమ్ ఇండియా నిలిచింది. NZతో మూడో టీ20లో 154 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే ఛేదించి ఈ ఘనతను అందుకుంది. అలాగే టీ20Iల్లో వరుసగా అత్యధిక సిరీస్‌లు(11) గెలిచిన పాకిస్థాన్ రికార్డును సమం చేసింది. స్వదేశంలో వరుసగా 10 సిరీస్‌లు గెలిచిన ఫస్ట్ టీమ్‌గా అవతరించింది.
News January 26, 2026
ఇంట్లో ఫారిన్ కరెన్సీ ఎంత ఉంచుకోవచ్చు?

ఇంట్లో విదేశీ కరెన్సీ నోట్లు ఉంచుకోవడానికి పరిమితి ఉంది. RBI&FEMA నిబంధనల ప్రకారం ఎలాంటి కాల పరిమితి లేకుండా USD 2,000 (లేదా దానికి సమానమైన విదేశీ కరెన్సీ) నోట్లు, ట్రావెలర్స్ చెక్స్ ఉంచుకోవచ్చు. ఒకవేళ అంతకు మించితే 180 రోజుల్లోగా అధికారిక డీలర్(బ్యాంక్) ద్వారా సరెండర్ చేయాలి లేదా RFC అకౌంట్‌లో జమ చేయాలి. విదేశీ నాణేలపై ఎలాంటి పరిమితి లేదు. అన్‌లిమిటెడ్‌గా ఉంచుకోవచ్చు.


