News August 29, 2024
బెంగళూరు ఎయిర్‌పోర్టులో హత్య

బెంగళూరు విమానాశ్రయంలో అందరూ చూస్తుండగానే హత్య జరిగింది. తన భార్యతో ఎయిర్‌పోర్టులో ట్రాలీ ఆపరేటర్‌గా పని చేసే రామకృష్ణ అక్రమసంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో రమేశ్ అనే వ్యక్తి అతడిపై దాడి చేశాడు. టెర్మినల్ 1లోని అరైవల్ పార్కింగ్ ఏరియాలోని వాష్‌రూమ్ వద్ద రామకృష్ణ మెడను కొడవలితో కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Similar News
News February 14, 2026
స్టైలింగ్ ఇలా మార్చుకోండి

చాలామంది అమ్మాయిలు ఫేస్ చేసే సమస్య ఎన్ని దుస్తులున్నా వేసుకోవడానికి ఏవీ లేవనేది వారి బాధ. కొత్త బట్టలు కొనకుండా స్టైలింగ్ కాస్త మారిస్తే మీ వార్డ్రోబ్ కొత్తగా కనిపిస్తుంది. ఉన్నవాటినే రంగులూ, డిజైన్ల వారీగా మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకోవచ్చు. ట్రెండీ దుస్తులు కాకుండా మీ ఒంటి తీరుకు ఏవి నప్పుతాయో చూసుకోండి. మీకంటూ ఓ స్టైల్ స్టేట్మెంట్ క్రియేట్ చేసుకోండి. అప్పుడే మీరేం వేసినా అందంగా కనిపిస్తారు.
News February 14, 2026
జ్యోతికతో పెళ్లికి నిరాకరించిన సూర్య తండ్రి.. ఆ ఒక్క మాటతో!

ప్రేమికుల దినోత్సవం వేళ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక లవ్ స్టోరీ వైరలవుతోంది. వీరి పెళ్లికి తొలుత సూర్య తండ్రి శివకుమార్ అంగీకరించలేదట. ‘పెళ్లి చేసుకుంటే జ్యోతికనే చేసుకుంటా. లేదంటే ఒంటరిగా ఉంటా’ అని సూర్య కరాఖండిగా చెప్పడంతో తన మనసు మార్చుకున్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 1999లో మొదలైన వీరి ప్రేమ 2006లో పెద్దల ఆశీస్సులతో పెళ్లిగా మారింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు.
News February 14, 2026
IND vs PAK: రేపు ‘మహా’ సంగ్రామం.. ఇప్పటి వరకు మనదే జోరు!

T20 WCలో IND vs PAK మధ్య ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు జరగ్గా 7-1తో మనదే ఆధిపత్యం. 2007 ‘బౌల్ అవుట్’ విక్టరీ నుంచి 2024 ‘న్యూయార్క్ లో-స్కోరింగ్ థ్రిల్లర్’ వరకు భారత్ తన సత్తాను చాటుతూనే ఉంది. విరాట్ కోహ్లీ మెల్బోర్న్ మిరాకిల్ (2022), బుమ్రా డెత్ ఓవర్ల మ్యాజిక్ (2024) వంటి మధుర జ్ఞాపకాలతో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. రేపటి మ్యాచ్‌లోనూ దాయాదుల పోరు ఆసక్తికరంగా సాగనుంది. IND విజయాల ఫొటోలను పైన చూడొచ్చు.


